తెలంగాణ సాంస్కృతిక సారథి ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తెలంగాణ సాంస్కృతిక సారథి (టీఎస్ఎస్‌) ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది.

By అంజి  Published on  29 Aug 2023 6:18 AM GMT
Telangana samskruthika Sarathi,PRC , Telangana, CM KCR

తెలంగాణ సాంస్కృతిక సారథి ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తెలంగాణ సాంస్కృతిక సారథి (టీఎస్ఎస్‌) ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. టీఎస్ఎస్‌ ఉద్యోగులకు పీఆర్‌సీ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాంస్కృతిక, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పీఆర్సీ 2020 ప్రకారం టీఎస్‌ఎస్‌ ఉద్యోగులకు పీఆర్సీ ఉంటుంది. పెంచిన పీఆర్సీ 2021 జూన్‌ 1వ తేదీ నుంచి వర్తింప చేస్తారు. పీఆర్సీ అమలుకు తదుపరి చర్యలు తీసుకోవాలని భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల క్రితం టీఎస్‌ఎస్‌ ఉద్యోగుల పీఆర్సీకి ఆర్థిక శాఖ క్లియరెన్స్‌ ఇచ్చింది. సీఎం కేసీఆర్‌ ఆమోదంతో సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.

తెలంగాణా సాంస్కృతిక సారధిలో మొత్తం 583 మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుత పే స్కేలు మీద 30% పీఆర్సీని ప్రభుత్వం అమలు చేయనుంది. తెలంగాణా సాంస్కృతిక సారధి ఉద్యోగుల ప్రస్తుత పే స్కేలు రూ. 24514గా ఉంది. ఒక్కొక్కరికి రూ.7300ల మేరకు జీత భత్యాలు పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రకటనతో ఆయా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తూ, సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్ల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సును ప్రభుత్వం పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వాళ్ల రిటైర్మెంట్ వయసు 61 ఏళ్లు కాగా.. దాన్ని 65 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story