Telangana: నేటి నుంచి సచివాలయంలో ఫేషియల్‌ అటెండెన్స్‌

తెలంగాణ సచివాలయంలో నేటి నుంచి ఫేషియల్‌ రికగ్నేషన్‌ అటెండెన్స్‌ విధానం అమలు కానుంది.

By అంజి  Published on  12 Dec 2024 1:27 AM GMT
Facial Recognition Attendance, Secretariat, Telangana

Telangana: నేటి నుంచి సచివాలయంలో ఫేషియల్‌ అటెండెన్స్‌

హైదరాబాద్‌: తెలంగాణ సచివాలయంలో నేటి నుంచి ఫేషియల్‌ రికగ్నేషన్‌ అటెండెన్స్‌ విధానం అమలు కానుంది. డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ సచివాలయంలో పని చేసే అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి దీనిని వర్తింపజేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. ఔట్‌ సోర్సింగ్‌, సచివాలయం హెడ్‌ నుంచి వేతనాలు పొందే ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా ఫేషియల్‌ అటెండెన్స్‌ అమల్లో ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. రోజు వారీ విధులకు హాజరయ్యే ఉద్యోగుల టైమింగ్‌ (హాజరు నమోదు)కోసం టెక్నాలజీని ఉపయోగిస్తోంది. ఇందులో భాగంగానే సచివాలయంలో ప్రతీ శాఖ ఎంట్రీ దగ్గర ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానాన్ని ఏర్పాటు చేసింది.

ఉద్యోగులు ఉదయం కార్యాలయానికి వచ్చేటప్పుడు, విధులు ముగించుకొని వెళ్లే సమయంలో తప్పనిసరిగా అటెండెన్స్‌ వేయాలని సూచించారు. అయితే ఈ ఫేషియల్‌ రికగ్నేషన్‌ అటెండెన్స్‌ నిర్ణయంపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ విధానంపై అభ్యంతరాలు ఉన్నాయని పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సీఎస్‌కు వినతిపత్రం సమర్పించారు. సచివాల ఉద్యోగులు కొన్నిసార్లు సందర్భాల్లో కోర్టుపని, అసెంబ్లీ విధులు, మంత్రులు, ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆలస్యంగా రావడం, వెళ్లడం వంటివి జరుగుతాయని చెబుతున్నారు. ఈ విధానాన్ని బలవంతంగా రుద్దడం సరికాదని అంటున్నారు.

Next Story