తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం.. ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ అధికారులు తెలిపారు.
By అంజి Published on 25 Feb 2024 4:30 AM GMTతెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం.. ఎల్లో అలర్ట్ జారీ
హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ అధికారులు తెలిపారు. ఈరోజు, రేపు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను ప్రకటించారు. నిన్న రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. తెలంగాణలోని కుమురం భీమ్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, బి.కొత్తగూడెం, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఇవాళ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
ఆదిలాబాద్, కుమురం భీమ్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి, వికారాబాద్‌లలో కూడా రేపు వర్షాలు కురుస్తాయని ఐఎండీ హైదరాబాద్ అంచనా వేసింది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) డేటా ప్రకారం, నిన్న రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 0.5-31.8 మిల్లీమీటర్ల వరకు వర్షాలు కురిశాయి, అత్యధికంగా నల్గొండలో 31.8 మిమీ నమోదైంది. శనివారం 15 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం పలు జిల్లాల్లో నమోదైంది. నల్గొండ 31.8 మిమీ, సిద్దిపేట 22.5 మిమీ, రాజన్న సిరిసిల్ల 16.8 మిమీ, రంగారెడ్డి 15.5 మిమీ, నారాయణపేట 15 మిమీ వర్షపాతం నమోదైంది. ఐఎండీ హైదరాబాద్ ఈ రోజు, రేపు ఎల్లో అలర్ట్ జారీ చేయడంతో, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది.