మరోసారి అస్వస్థతకు గురైన వనజీవి రామయ్య.. ఐసీయూలో చికిత్స
Illness to Padma Shri Vanjeevi Ramaiah.పద్మశ్రీ అవార్డు గ్రహీత, వన జీవి రామయ్య మరోసారి అస్వస్థతకు గురయ్యారు.
By తోట వంశీ కుమార్ Published on
5 July 2021 7:27 AM GMT

పద్మశ్రీ అవార్డు గ్రహీత, వన జీవి రామయ్య మరోసారి అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆయన్ను కుటుంబ సభ్యులు ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ బి వెంకటేశ్వర్లు, ఆర్‌ఎంవో బి శ్రీనివాస్, ఏవో రాజశేఖర్‌గౌడ్ ఆయనకు పరీక్షలు నిర్వహించారు. కొవిడ్ రాపిడ్. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో ఆయనకు నెగిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, బలహీనంగా ఉండడంతో ఫ్లూయిడ్స్ ఎక్కించి ఇంటికి పంపించనున్నట్లు డాక్టర్ సురేష్ తెలిపారు.
గత కొంతకాలంగా వనజీవి రామయ్య అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి గురై ఆసుపత్రిలో చేరిన రామయ్య అనంతరం కోలుకున్నారు. అయితే నిరంతరం మొక్కల గురించి ఆలోచించే ఆయన.. ఏంత ఇబ్బంది ఉన్న మొక్కలను నాటే కార్యక్రమంను మాత్రం ఏ రోజు వాయిదా వేయరు. ప్రతి రోజు మొక్కలను నాటుతునే ఉండాలన్నది ఆ కోరిక. ఇప్పటి వరకు ఆయన దాదాపు 3కోట్ల మొక్కలను నాటారు.
Next Story