'తోపు డైలాగ్‌లు చెప్పి జైల్లో ఉన్నాడు'.. ఐబొమ్మ రవి అంత ఈజీగా వదిలిపెట్టం: సజ్జనార్
ఐబొమ్మ వెట్‌సైట్ ద్వారా రూ.20 కోట్లు సంపాదిచినట్టు ఇమ్మడి రవి చెప్పాడని హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వీసీ సజ్జనార్ తెలిపారు.
By - అంజి |
'తోపు డైలాగ్‌లు చెప్పి జైల్లో ఉన్నాడు'.. ఐబొమ్మ రవి అంత ఈజీగా వదిలిపెట్టం: సజ్జనార్
హైదరాబాద్: ఐబొమ్మ వెట్‌సైట్ ద్వారా రూ.20 కోట్లు సంపాదిచినట్టు ఇమ్మడి రవి చెప్పాడని హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వీసీ సజ్జనార్ తెలిపారు. అతని వద్ద నుంచి రూ.3 కోట్లు సీజ్ చేసినట్టు వెల్లడించారు. ఒక సైట్ బ్లాక్ చేస్తే మరో మిర్రర్ సైట్ సృష్టించేవాడని, మొత్తం 65 మిర్రర్ సైట్లు సృష్టించాడని తెలిపారు. ఇమ్మడి రవి దగ్గర 50 లక్షల మంది సబ్‌స్క్రైబర్లడేటా ఉందని, ఆ డేటా సైబర్ క్రైమ్‌లకు గురయ్యే అవకాశం ఉందన్నారు. ఆ డేటాతో యూజర్లను సైబర్ నేరగాళ్లు ట్రాప్ చేసే అవకాశం ఉందని తెలిపారు.
ఐబొమ్మ రవి సినిమాలను పైరసీ చేయడమే కాకుండా బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేశాడని సీపీ సజ్జనార్ తెలిపారు. 'రవిని పోలీస్ కస్టడీకి కోరాం. విచారణలో పూర్తి వివరాలు రాబడతాం. పైరసీ చేసినా, చూసినా నేరమే. యూజర్ల డివైజ్‌లలోకి మాల్వేర్ పంపి వ్యక్తిగత డేటా సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి. ఇలాంటి సైట్లను ఎంకరేజ్ చేయవద్దు' అని సీపీ సూచించారు. 'దమ్ముంటే పట్టుకోండి' అని పోలీసులకు సవాల్ విసిరిన రవి ఇప్పుడు జైల్లో ఉన్నాడని సీపీ సజ్జనార్ అన్నారు.
సీపీ సజ్జనార్ ఇంకా మాట్లాడుతూ.. తన వద్ద 5 కోట్ల మంది డేటా ఉందని, దమ్ముంటే పట్టుకోవాలని రవి ఛాలెంజ్ చేశాడని, ప్రభుత్వం తలచుకుంటే ఏమైందో మీరు చూశారని అన్నారు. నేరస్థులు ఎక్కడ ఉన్నా హైదరాబాద్ పోలీసులు వదలరని, తోపు మాటలు చెప్పినవాడు జైల్లో ఉన్నాడని చెప్పారు. వెబ్‌సైట్ డిజైనింగ్, డెవలపింగ్‌లో రవి ఆరితేరాడని చెప్పారు. ఐబొమ్మ వ్యవస్థాపకుడు రవి 2009లోనే ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించారని సీపీ సజ్జనార్ తెలిపారు. అతడికి 110 వెబ్ డొమైన్‌లు ఉన్నాయని, ఒకటి బ్లాక్ చేస్తే మరొకటి ఓపెన్ అయ్యే విధంగా డిజైన్ చేశారని చెప్పారు. విదేశాల్లోనే ఎక్కువ ఉంటునన రవి.. ఓ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకుని ఈ వైబ్‌సైట్లను నడపుతున్నారని సజ్జనార్ తెలిపారు.