బేగంపేటలో నాలాలపై ఆక్రమణలు కూల్చివేసిన హైడ్రా

బేగంపేట-ప్యాట్నీ పరిధిలో ఆక్రమణపై కొరడా ఝులిపించింది.

By Knakam Karthik
Published on : 6 Jun 2025 10:19 AM IST

Hyderabad News, Hydra, encroachments on drains

బేగంపేటలో నాలాలపై ఆక్రమణలు కూల్చివేసిన హైడ్రా

హైదరాబాద్‌లో ఆక్రమణలపై హైడ్రా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే సిటీలో కబ్జాకు గురైన స్థలాలను కాపాడుతోన్న హైడ్రా..తాజాగా బేగంపేట-ప్యాట్నీ పరిధిలో ఆక్రమణపై కొరడా ఝులిపించింది. పాట్నీ నాలా పరివాహక ప్రాంతంలో ఆక్రమణలను అధికారులు తొలగించారు. కంటోన్మెంట్‌ యంత్రాంగంతో కలిసి నాలాపై నిర్మించిన అక్రమ కట్టడాల తొల‌గింపును అధికారులు చేప‌ట్టారు. గురువారం కంటోన్మెంట్‌ సీఈఓ మధుకర్‌ నాయక్‌తో కలిసి హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ప్యాట్నీ నాలాను పరిశీలించారు. ఈ సందర్భంగా నాలాను ఆక్రమించినవారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

దీంతో శుక్రవారం ఉదయాన్నే బుల్డోజర్లతో అక్కడి చేరుకున్న హైడ్రా సిబ్బంది ఆక్రమణలను కూల్చివేశారు. అక్రమ నిర్మాణాలతో ప్యాట్నీ నాలా కుచించుకుపోవడంతో వరదలు వచ్చినప్పుడు కాలనీలు, ఇండ్లలోకి నీరు ప్రవేశిస్తుందని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా అధికారులు కూల్చివేతలు చేపట్టారు.

Next Story