మందుబాబులకు ఇది చేదు వార్త.. అయితే అది కేవలం హైదరాబాద్‌లోని వారికి మాత్రమే. సిటీలో వైన్స్ షాపులు కొద్ది రోజులు మూత పడనున్నాయి. ఈ నెల 23న హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న దృష్ట్యా మద్యం షాపులు మూత పడనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో వరుసగా నాలుగు రోజుల పాటు వైన్స్ షాపులను మూసివేయనున్నారు.
ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 21న సాయంత్రం 4 గంటల నుంచి 23న సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. మరో వైపు కౌంటింగ్ జరిగే తేదీ ఈ నెల 25న కూడా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తరపున గౌతమ్ రావు, ఎంఐఎం తరపున మీర్జా రియాజ్ ఉహ్ హాసన్ పోటీలో ఉన్నారు.