హైదరాబాద్ వాసులకు జలమండలి హెచ్చరికలు జారీ చేసింది. తాగునీటి నల్లాలకు మోటార్లు బిగిస్తే రూ.5 వేలు జరిమానా విధిస్తామని ప్రకటించింది. జలమండలి ప్రధాన కార్యాలయంలో బుధవారం హైదరాబాద్‌లో తాగునీటి సరఫరాపై ఎండీ అశోక్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. నల్లాలకు మోటార్ బిగిస్తే సీజ్ చేయడంతో పాటు నల్లా నీటి కనెక్షన్‌ను కూడా రద్దు చేస్తామని హైదరాబాద్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డు ఎండీ వార్నింగ్ ఇచ్చారు.
మోటర్ ఫ్రీ టాప్ వాటర్’ పేరుతో ఈ నెల 15 నుంచి వాటర్ స్పెషల్ డ్రైవ్ అమలు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. ఎవరైనా వినియోగదారులు తమ నల్లాలకు మోటర్లు బిగించి పట్టుబడితే.. వారిపై జలమండలి నిబంధనల ప్రకారం రూ.5వేలు జరిమానా విధించడంతోపాటు మోటర్లు సీజ్ చేస్తామని చెప్పారు. వేసవి కాలం రావడంతో నగర ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు జలమండలి ఈ నిర్ణయం తీసుకుంది.