హైదరాబాద్ టూ బెంగళూరు: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఛార్జీలు ఇవే
బెంగళూరు-హైదరాబాద్ మధ్య కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఛార్జీలను రైల్వే శాఖ ప్రకటించింది.
By అంజి Published on 25 Sep 2023 5:05 AM GMTహైదరాబాద్ టూ బెంగళూరు: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఛార్జీలు ఇవే
బెంగళూరు-హైదరాబాద్ మధ్య కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఛార్జీలను రైల్వే శాఖ ప్రకటించింది. యశ్వంత్‌పూర్ నుంచి కాచిగూడకు ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్‌లో వెళ్లేందుకు రూ.2,865, చైర్‌కార్‌లో రూ.1,540 ఖర్చు అవుతుంది. కాచిగూడ నుంచి యశ్వంత్‌పూర్‌కు ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్‌లో అయితే రూ.2,915, చైర్‌కార్‌లో రూ.1,600గా టికెట్ ధర నిర్ణయించారు. బుధవారం మినహా వారంలో 6 రోజులు సేవ అందుబాటులో ఉంటుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ని ప్రారంభించారు. ప్రారంభోత్సవ ప్రత్యేక రైలు కాచిగూడ నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు బయలుదేరి రాత్రి 11.45 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంది. ఇవాళ్టి నుంచి యశ్వంత్‌పూర్ నుండి కాచిగూడ వరకు సాధారణ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.
ప్రయాణికులు, సమయాలను గమనించండి
రైలు నం. 20703 (కాచిగూడ నుండి యశ్వంత్‌పూర్): కాచిగూడ నుండి ఉదయం 5.30 గంటలకు బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది.
స్టాప్ లు: మహబూబ్‌నగర్ (6.49/6.50 గంటలు), కర్నూలు సిటీ (ఉదయం 8.24/8.25 గంటలు), అనంతపురం (ఉదయం 10.45/10.45 గంటలు) ధర్మవరం (11.14/11.15 గంటలు)
రైలు నెం. 20704 (యశ్వంత్‌పూర్ నుండి కాచిగూడ) : యశ్వంత్‌పూర్ నుండి మధ్యాహ్నం 2.45 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 11.15 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది
స్టాప్ లు: ధర్మవరం (సాయంత్రం 4.59/5 గంటలు), అనంతపురం (5.29/5.30 గంటలు), కర్నూలు సిటీ (7.50/7.51 గంటలు), మహబూబ్‌నగర్ (రాత్రి 9.34/9.35గంటలు)
నిన్న ప్రధాని నరేంద్ర మోదీ ఒకేసారి దేశ వ్యాప్తంగా 9 వందే భారత్ రైళ్లను వర్చువల్‌గా ప్రారంభించారు. దీంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందేభారత్ సర్వీసులను మరింత విస్తరించినట్లు అయ్యింది. ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందేభారత్ సర్వీసులను మరింత విస్తరించినట్లు అయ్యింది. ఇప్పటికే పలుమార్గాల్లో వందేభారత్ సర్వీసులు నడుస్తున్నాయి.. ఆ రైళ్లకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని స్లీపర్, మినీ వందే భారత్ రైళ్ల సర్వీసులను విస్తరించాలని మోదీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.