గోల్డ్ ట్రేడింగ్ పేరుతో.. టెక్కీని బోల్తా కొట్టించిన సైబర్ నేరగాళ్లు
మహబూబాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆన్‌లైన్ గోల్డ్ ట్రేడింగ్ మోసానికి బలై ఇటీవల సైబర్ మోసగాళ్ల చేతిలో రూ.4,15,000 పోగొట్టుకున్నాడు.
By అంజి Published on 25 Dec 2024 11:58 AM ISTగోల్డ్ ట్రేడింగ్ పేరుతో.. టెక్కీని బోల్తా కొట్టించిన సైబర్ నేరగాళ్లు
హైదరాబాద్: మహబూబాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆన్‌లైన్ గోల్డ్ ట్రేడింగ్ మోసానికి బలై ఇటీవల సైబర్ మోసగాళ్ల చేతిలో రూ.4,15,000 పోగొట్టుకున్నాడు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న పి దేవేందర్‌గా గుర్తించిన బాధితుడు.. డిసెంబర్ 15 న, బంగారం ట్రేడింగ్ కోసం నమోదు చేసుకోవాలని వెబ్‌సైట్ లింక్‌లతో పాటు తెలియని నంబర్ నుండి వాట్సాప్‌లో సందేశం వచ్చిందని తెలిపాడు. మొదట్లో దేవేందర్ ఆ సందేశాన్ని పట్టించుకోలేదు, స్పందించలేదు.
అయితే అతను బంగారం వ్యాపారం, అది ఎంత లాభదాయకంగా ఉంది అనే వివరాలను అందుకుంటూనే ఉన్నాడు. దాదాపు 68 మంది బంగారానికి వేలం వేస్తున్నారని, భారీ లాభం పొందవచ్చని మోసగాళ్లు నమ్మించారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ వారిని నమ్మి మోసగాళ్లు పంపిన ఖాతా నంబర్‌కు వివిధ ఖాతాల నుంచి రూ.4.15 లక్షలు బదిలీ చేశాడు. మరుసటి రోజు మళ్లీ రూ.4.75 లక్షలు పంపాలని కోరారు. మోసపోయానని గ్రహించిన దేవేందర్ మహబూబాబాద్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
2024లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు సైబర్ మోసాల కారణంగా రూ.1,866 కోట్లు పొగొట్టుకున్నారు. ఇది సగటు రోజువారీ నష్టం దాదాపు రూ. 5 కోట్లు. 2024లో నివేదించబడిన అత్యంత సాధారణ సైబర్ మోసాలలో వ్యాపార పెట్టుబడి/స్టాక్ మోసాలు, పార్ట్ టైమ్ ఉద్యోగాలు, డిజిటల్ అరెస్ట్, నకిలీ కస్టమర్ కేర్ , డెబిట్, క్రెడిట్ కార్డ్ మోసాలు ఉన్నాయి. సైబర్ క్రైమ్‌కు సంబంధించి అత్యధిక ఫిర్యాదులు సైబరాబాద్‌లో ఉన్నాయి, ఆ తర్వాతి స్థానాల్లో హైదరాబాద్, రాచకొండ ఉన్నాయి .
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ( TGCSB ) డైరెక్టర్ శిఖా గోయెల్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం నుండి ఈ సంవత్సరం నేషనల్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP 1930) ఫెసిలిటీలో 1,14,174 సైబర్ మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు నమోదయ్యాయని, అంతకుముందు సంవత్సరం 91,652 ఫిర్యాదులు నమోదయ్యాయని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే సైబర్ నేరాలు 18 శాతం పెరిగాయి. ప్రజలు ఇంటర్నెట్‌ను సమర్థంగా వినియోగించుకోవడం మరియు మోసగాళ్లు ప్రజలను మోసం చేసేందుకు అవలంబించిన కొత్త విధానాల వల్ల ఇది జరిగింది” అని శిఖా గోయెల్ అన్నారు.