హైదరాబాద్ మెట్రో ఫేజ్-2పై ఎంపీలకు అవగాహన సమావేశం

హైదరాబాద్‌లో మెట్రో రైల్ రెండో ఫేజ్‌కు సంబంధించి తెలంగాణ ఎంపీలకు రాష్ట్ర ప్రభుత్వం అవగాహన సమావేశం నిర్వహించింది.

By Knakam Karthik
Published on : 20 July 2025 7:59 AM IST

Hyderabad, Hyd Metro, Metro Phase-2, awareness meet for Telangana MPs

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2పై ఎంపీలకు అవగాహన సమావేశం

హైదరాబాద్‌లో మెట్రో రైల్ రెండో ఫేజ్‌కు సంబంధించి తెలంగాణ ఎంపీలకు రాష్ట్ర ప్రభుత్వం అవగాహన సమావేశం నిర్వహించింది. పార్క్ హయత్‌లో నిర్వహించిన మెట్రోరైల్ ఫేజ్-2 అవగాహన సమావేశానికి రాష్ట్ర ఎంపీలు హాజరయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కాంగ్రెస్, బీజేపీకి చెందిన ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి చామల కిరణ్ కుమార్ రెడ్డి, జీ.వంశీ కృష్ణ, పి.బలరాం నాయక్, కుందూరు రఘువీర్, డాక్టర్ మల్లు రవి, ఆర్.రఘురామ్ రెడ్డి, సురేష్ కుమార్ షెట్కర్, ఎం.అనీల్ కుమార్ యాదవ్, బీజేపీ నుండి ఈటల రాజేందర్, ఎం.రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

రెండో దశ విస్తరణకు సంబంధించి కేంద్రం త్వరితగతిన అనుమతులు మంజూరు చేసేలా రాష్ట్రానికి చెందిన ఎంపీలు పార్టీలకు అతీతంగా కృషి చేయాలని మంత్రులు కోరారు. రెండో దశకు సంబంధించి అంశాలపై అవగాహన కల్పిస్తూ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రాజెక్టుకి సంబంధించి వివిధ సందేహాలను ఆయన నివృతి చేశారు.

Next Story