గుడ్‌న్యూస్..ఛార్జీలపై 10% డిస్కౌంట్ ప్రకటించిన మెట్రో
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు చెప్పింది.
By Knakam Karthik
గుడ్‌న్యూస్..ఛార్జీలపై 10% డిస్కౌంట్ ప్రకటించిన మెట్రో
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు చెప్పింది.మెట్రో రైల్ ఛార్జీలను తగ్గిస్తున్నట్లు ఇంతకు ముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సవరించిన, తగ్గిన ఛార్జీలు శనివారం నుండి అమల్లోకి రానున్నాయి. దీనితో ప్రయాణికులపై కొంత ఆర్థిక భారం తగ్గనుంది.
ఇటీవల హైదరాబాద్ మెట్రో ఛార్జీలను పెంచింది. దీనిపై సర్వత్రా వ్యతిరేకత రావడంతో ఎల్ అండ్ టీ యూటర్న్ తీసుకుంది. పెంచిన మెట్రో చార్జీలను సవరించిన హైదరాబాద్ మెట్రో సంస్థ.. శుక్రవారం (మే 23) కొత్త చార్జీల చార్టును విడుదల చేసింది. ఇందులో 10 శాతం డిస్కౌంటు ఇస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. తగ్గిన చార్జీలు మే 24వ తేదీ నుంచి అమలులోకి రానున్నట్టు మెట్రో రైలు సంస్థ ప్రకటించింది. ఈ మేరకు కొత్త చార్జీలు విడుదల చేసింది.
ఫేర్ జోన్ వారీగా సవరించిన ఛార్జీలు ఇవే..
2 కిలోమీటర్లలోపు ఛార్జీ రూ.11
2 నుంచి 4 కిలోమీటర్ల వరకు ఛార్జీ రూ.17
4 నుంచి 6 కిలోమీటర్ల వరకు ఛార్జీ రూ.28
6 నుంచి 9 కిలోమీటర్ల వరకు ఛార్జీ రూ.37
9 నుంచి 12 కిలోమీటర్ల వరకు ఛార్జీ రూ.47
12 నుంచి 15 కిలోమీటర్ల వరకు ఛార్జీ రూ.51
15 నుంచి 18 కిలోమీటర్ల వరకు ఛార్జీ రూ.56
18 నుంచి 21 కిలోమీటర్ల వరకు ఛార్జీ రూ.61
21 నుంచి 24 కిలోమీటర్ల వరకు ఛార్జీ రూ.65
24 ఆపై కిలోమీటర్లకు ఛార్జీ రూ.69