డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలు.. జర భద్రం!

ఈ మధ్య కాలంలో సైబర్‌ నేరాలు భారీగా పెరిగాయి. చదువు లేని వారే కాదు.. చదువుకున్నవారు సైతం సైబర్‌ నేరాలకు గురవుతున్నారు.

By -  అంజి
Published on : 23 Dec 2025 11:00 AM IST

Hyderabad CP Sajjanar, public, frauds, digital arrest, Telangana

డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలు.. జర భద్రం!

హైదరాబాద్‌: ఈ మధ్య కాలంలో సైబర్‌ నేరాలు భారీగా పెరిగాయి. చదువు లేని వారే కాదు.. చదువుకున్నవారు సైతం సైబర్‌ నేరాలకు గురవుతున్నారు. ముఖ్యంగా ఈమధ్య డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో సైబర్‌ మోసగాళ్లు ప్రజలను భారీగా దోచుకుంటున్నారు. ఈ క్రమంలోనే సైబర్‌ మోసాలపై ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో జరిగే మోసాలపై ప్రజలను అలర్ట్‌ చేశారు.

"హలో.. మేము సీబీఐ, నార్కోటిక్స్ నుంచి మాట్లాడుతున్నాం.. మీ పేరు మీద డ్రగ్స్ పార్శిల్ వచ్చింది.. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం" అంటూ సైబర్‌ మోసగాళ్లు వీడియో కాల్స్‌ చేసి బెదిరింపులకు గురి చేస్తారు. ఇలాంటి వీడియో కాల్స్ వస్తే.. జాగ్రత్తగా ఉండాలని సజ్జనార్‌ సూచించారు. పోలీస్ యూనిఫారం, వెనకాల పోలీస్ స్టేషన్ సెటప్ చూసి దడ పుట్టేలా బెదిరిస్తారని, వీడియో కాల్ కట్ చేయొద్దని హుకూం జారీ చేస్తారని, ఇదంతా సైబర్ గాళ్ల మాయాజాలం అని పేర్కొన్నారు.

చట్టంలో 'డిజిటల్ అరెస్ట్' అనేదే లేదు.. ఇదంతా ఉట్టి భ్రమే అని తెలిపారు. 'సైబర్‌ నేరగాళ్ల కాల్స్ నమ్మి ఆగమాగం కాకండి.. డబ్బులు పోగొట్టుకోకండి. డౌట్ వస్తే వెంటనే 1930కి కాల్ కొట్టండి' అని సజ్జనార్‌ తెలిపారు.

Next Story