Hyderabad: ఫ్రిడ్జ్‌లో ఎలుకలు, మూడు రోజుల నాటి బిర్యానీ.. హోటల్ యజమానిపై క్రిమినల్ కేసు

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లో ఉన్న 'లక్కీ బిర్యానీ షవర్మ' రెస్టారెంట్ వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ అడ్డంగా దొరికిపోయింది.

By -  అంజి
Published on : 7 April 2026 10:04 AM IST

Banjara Hills Lucky Biryani, Rotten Food Complaint, Rats in Restaurant Fridge, Food Safety Hyderabad, Zomato Delivery Issue, Criminal Case Hotel Owner, Unhygienic Food Hyderabad

Hyderabad: ఫ్రిడ్జ్‌లో ఎలుకలు, మూడు రోజుల నాటి బిర్యానీ.. హోటల్ యజమానిపై క్రిమినల్ కేసు

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లో ఉన్న 'లక్కీ బిర్యానీ షవర్మ' రెస్టారెంట్ వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ అడ్డంగా దొరికిపోయింది. వెంకటరమణ కాలనీకి చెందిన కొండారెడ్డి అనే వ్యక్తి ఆదివారం జొమాటోలో చికెన్ బిర్యానీ ఆర్డర్ చేయగా, అది కుళ్లిపోయి దుర్వాసన రావడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సదరు హోటల్‌పై దాడి చేయగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. జీడిమెట్లలో మూడు రోజుల క్రితమే తయారు చేసిన సుమారు 80 బిర్యానీ ప్యాకెట్లను ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచి, ఆర్డర్ రాగానే ఓవెన్‌లో వేడి చేసి కస్టమర్లకు పంపిస్తున్నట్లు తేలింది.

మరింత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, ఆ హోటల్‌లోని ఫ్రిడ్జ్‌ను తెరిచి చూడగా అందులో ఎలుకలు తిరుగుతూ కనిపించాయి. హోటల్ మొత్తం ఎలుకలు, బొద్దింకలు మరియు దుర్గంధంతో నిండిపోయి అపరిశుభ్రతకు నిలయంగా మారింది. యజమాని ఇర్ఫాన్ ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు నిర్ధారించారు.

ఈ ఘటనపై స్పందించిన పోలీసులు హోటల్‌ను తక్షణమే సీజ్ చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా హోటల్‌లో తనిఖీలు నిర్వహించి నమూనాలను సేకరించారు. నిందితుడు ఇర్ఫాన్‌పై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేసే వారు జాగ్రత్తగా ఉండాలని ఈ ఘటన హెచ్చరిస్తోంది.

Next Story