భార్య దూకిందనుకొని బావిలో దూకిన భర్త.. పొలం దగ్గర ఏడుస్తూ కనిపించిన భార్య

వాళ్లిద్దరూ భార్య భర్తలు. ఏదో విషయమై ఇద్దరూ గొడవపడ్డారు. ఈ క్రమంలోనే భార్య మనస్తాపం చెంది.. తాను చనిపోతానంటూ భర్తను

By అంజి
Published on : 24 April 2023 9:00 AM IST

Khammam district, crime news, nelakondapalli

భార్య దూకిందనుకొని బావిలో దూకిన భర్త.. పొలం దగ్గర ఏడుస్తూ కనిపించిన భార్య

వాళ్లిద్దరూ భార్య భర్తలు. ఏదో విషయమై ఇద్దరూ గొడవపడ్డారు. ఈ క్రమంలోనే భార్య మనస్తాపం చెంది.. తాను చనిపోతానంటూ భర్తను బెదిరించింది. ఆ తర్వాత కాసేపు భార్య కనబడకపోయేసరికి భార్య బావిలో దూకిందేమోననుకుని, ఆమెను కాపాడాలన్న ఉద్దేశంతో భర్త బావిలోకి దూకాడు. ఇది గమనించిన మరో వ్యక్తి అతడికి ఈత రాదని తెలిసి, అతడిని కాపాడేందుకు బావిలో దూకాడు. తీరా చూస్తే స్థానికులకు తభార్య సమీప పొలంలో ఏడ్చుకుంటూ కనిపించింది. మరోవైపు బావిలో దూకిన ఇద్దరూ గల్లంతయ్యారు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలం అప్పల నరసింహాపురంలో ఆదివారం రాత్రి జరిగింది.

స్థానికంగా ఉన్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇంటిలో నివాసం ఉంటున్న కర్లపూడి నాగరాజు, రమణ దంపతులు గొడవపడ్డారు. మనస్తాపానికి గురైన రమణ ఇంటి నుంచి వెళ్లిపోతూ.. తాను బావిలో దూకి చస్తానంటూ భర్తను బెదిరించింది. దీంతో సమీప వ్యవసాయ బావలో భార్య దూకిందేమోనని భావించి భర్త నాగరాజు అందులో దూకాడు. అతనికి స్విమ్మింగ్ రాదు. దీంతో అతడి స్నేహితుడు యండాత్రి జోజి కూడా బావిలో దూకాడు. అయితే భార్య రమణ మాత్రం సమీప పొలం దగ్గర కూర్చొని ఏడుస్తూ స్థానికులకు కనిపించింది. మరోవైపు బావిలో దూకిన ఇద్దరు గల్లంతయ్యారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.

Next Story