మండుతున్న కూరగాయల ధరలు.. సామాన్యుడు విలవిల..!
Huge increase in vegetable prices. కూరగాయాల ధరలు మండిపోతున్నాయి. ప్రధాన నగరాలు, పట్టణాల్లో... ఎది కొనాలన్నా కిలో రూ.60కి తక్కువగా
By అంజి
కూరగాయాల ధరలు మండిపోతున్నాయి. ప్రధాన నగరాలు, పట్టణాల్లో... ఎది కొనాలన్నా కిలో రూ.60కి తక్కువగా లేవు. మొన్నటి వరకు రూ.20 కిలో ఉన్న టమానా రూ.60 కి చేరింది. టమాటాతో పాటు మిర్చి, బెండకాయ, కాకరకాయ, వంకాయ, బీరకాయ, దొండకాయ, చిక్కుడు, అల్చింత కూరగాయల ధరలు ఆకాశనంటాయి. దీంతో నగరాలు, పట్టణాల్లో ఉండే సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిలో కూరగాయాలు కొనాల్సిన చోటా.. అర్థకిలో, పావు కిలో కొంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఆకూ కూరల ధరలు, కొత్తిమీర, మెంతి, పుదీనా ధరలు కూడా మండిపోతున్నాయి.
ఈ సారి భారీగా వర్షాలు కురవడంతో కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటింది. వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ కూరగాయల పంటలు నీటిలోనే మునిగి ఉన్నాయి. దీంతో కూరగాయాలకు చీడ పురుగు పట్టి నాశనమవుతున్నాయి. ఇక పక్క రాష్ట్రాల నుంచి మార్కెట్లలోకి కూరగాయాల లోడులు తక్కువగా వస్తుండడంతో.. రేట్లు విపరీతంగా పెరిగాయి. ఈ ధరలు మరో రెండు నెలల పాటు ఇలాగే ఉండొచ్చని వ్యాపారులు అంటున్నారు. ధరలను చూసి కూడా కొందరు కూరగాయలను కొనడం లేదని, కూరగాయలు ఎక్కువ నిల్వ ఉండకపోవడంతో.. ఎంతో కొంత చూసుకుని అమ్ముతున్నాని కూరగాయల వ్యాపారులు చెబుతున్నారు.
హైదరాబాద్‌లోని రైతు బజార్లకు నగర శివారు జిల్లాల నుంచి రోజు కూరగాయలు వస్తుంటాయి. నగరంలో రోజు 600 నుంచి 800 టన్నుల దాకా క్రయా విక్రయాలు జరిగేవి. కానీ ఇప్పుడు కేవలం 500 టన్నుల కూరగాయలు మాత్రమే నగరానికి వస్తున్నాయి. మరో వైపు డీజిల్ రేట్లు పెరగడంతో రైతులు తమ కూరగాయల దిగుబడిని నగరాలకు తీసుకురాకుండా లోకల్‌గానే అమ్ముకుంటున్నారు.