తెలంగాణలో భారీగా పెరిగిన మీసేవ చార్జీలు..నేటి నుంచే అమల్లోకి!

తెలంగాణలో సామాన్య ప్రజలపై ప్రభుత్వం చార్జీల భారం మోపింది.

By -  Knakam Karthik
Published on : 1 April 2026 4:05 PM IST

Telangana, MeeSeva, Service Charges, Price Hike, Government Services

తెలంగాణలో భారీగా పెరిగిన మీసేవ చార్జీలు..నేటి నుంచే అమల్లోకి!

తెలంగాణలో సామాన్య ప్రజలపై ప్రభుత్వం చార్జీల భారం మోపింది. రాష్ట్రవ్యాప్తంగా మీసేవ కేంద్రాల్లో అందించే సేవల ధరలను భారీగా పెంచుతూ ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఏ-కేటగిరీ సేవలకు (తక్షణమే లభించే సర్టిఫికెట్లు) 35 రూపాయలుగా ఉన్న యూజర్ చార్జీని ఏకంగా 62 రూపాయలకు పెంచారు.

అలాగే, బీ-కేటగిరీ సేవలకు (దరఖాస్తు చేసుకున్న తర్వాత వచ్చే కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు వంటివి) గతంలో ఉన్న చార్జీని 80 రూపాయలకు సవరించారు. అంటే కనీస చార్జీలపై దాదాపు 80 శాతం మేర పెంపుదల కనిపించింది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన ఏప్రిల్ 1 నుంచే ఈ పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి.

మీసేవ నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ, నిత్యం అవసరమయ్యే సర్టిఫికెట్ల కోసం సామాన్యులు ఇప్పుడు రెట్టింపు మొత్తాన్ని చెల్లించాల్సి రావడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పెంపు కేవలం సర్టిఫికెట్లకే కాకుండా ఆర్టీఏ సేవలు, బిల్లుల చెల్లింపుల వంటి ఇతర దరఖాస్తులపై కూడా ప్రభావం చూపనుంది.

Next Story