హైదరాబాద్ సిటీలో గణేశ్ నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నిమజ్జనం సందర్భంగా నగరం వ్యాప్తంగా గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా హుస్సేన్ సాగర్ వద్ద గణనాథుల నిమజ్జనానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్‌ఎంసీ మేయర్, హైదరాబాద్ కలెక్టర్ పరిశీలించారు.
అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ...నగరంలో గణేష్ శోభాయాత్ర కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. అన్ని శాఖల అధికారుల సమయంతో ఏర్పాట్లు పూర్తి చేశాము. ఇప్పటివరకు 170000 విగ్రహాలు నిమజ్జనం పూర్తి అయ్యాయి. రేపు మరో 50వేలు పైగా నిమజ్జనం అవుతాయి. హుస్సేన్ సాగర్ తో పాటు జిహెచ్ఎంసి వ్యాప్తంగా 70 ప్రాంతాల్లో నిమజ్జనం చేసుకున్నందుకు ఏర్పాట్లు చేశాము. నగరవాసులందరూ అధికారుల సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాము...అని మంత్రి పొన్నం తెలిపారు.