దయచేసి పిలవండి.. మేము చెప్పేదీ వినండి: అసదుద్దీన్ ఒవైసీ

పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తూ నిజమైన అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు.

By Medi Samrat
Published on : 24 April 2025 4:01 PM IST

దయచేసి పిలవండి.. మేము చెప్పేదీ వినండి: అసదుద్దీన్ ఒవైసీ

పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తూ నిజమైన అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు.

“పహల్గామ్ ఘటన గురించి ఆల్ పార్టీ మీటింగ్ ను నిర్వహించే విషయమై నేను నిన్న రాత్రి @KirenRijiju తో మాట్లాడాను. ఐదు లేదా పది మంది ఎంపీలు ఉన్న పార్టీలను మాత్రమే ఆహ్వానించాలని వారు ఆలోచిస్తున్నారని అన్నారు. తక్కువ మంది ఎంపీలు ఉన్న పార్టీలను ఎందుకు ఆహ్వానించకూడదని నేను అడిగినప్పుడు, సమావేశం చాలా పెద్దగా ఉంటుందని ఆయన అన్నారు.” అంటూ ఒవైసీ పోస్టు పెట్టారు.

“ఇది బీజేపీ లేదా మరొక పార్టీ అంతర్గత సమావేశం కాదు, ఉగ్రవాదానికి, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే దేశాలకు వ్యతిరేకంగా బలమైన, ఐక్య సందేశాన్ని పంపడానికి ఇది అన్ని పార్టీల సమావేశం. అన్ని పార్టీల ఆందోళనలను వినడానికి ప్రధాని మోదీ అదనంగా ఒక గంట గడపలేరా?” అని ప్రశ్నించారు. “మీ స్వంత పార్టీకి మెజారిటీ లేదు. అది ఒక ఎంపీ ఉన్న పార్టీ అయినా లేదా 100 మంది ఎంపీ ఉన్న పార్టీ అయినా, వారిద్దరూ భారతీయుల ద్వారానే ఎన్నుకోబడ్డారు. ఇది రాజకీయ సమస్య కాదు, ఇది జాతీయ సమస్య. ప్రతి ఒక్కరూ వినాలి. దీనిని నిజమైన అఖిల పక్ష సమావేశంగా మార్చాలని నేను ప్రధానిని కోరుతున్నాను, పార్లమెంటులో ఒక ఎంపీ ఉన్న ప్రతి పార్టీని ఆహ్వానించాలి” అని అసదుద్దీన్ కోరారు.

Next Story