బైకర్‌ను ఢీకొట్టి కారు ఆపకుండా వెళ్లిన న‌టుడు అరెస్ట్‌

రోడ్డు ప్రమాదం కేసులో నటుడు శ్రీనాథ్ భాసిని అరెస్టు చేసిన పోలీసులు.. స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు.

By Kalasani Durgapraveen  Published on  15 Oct 2024 1:55 PM IST
బైకర్‌ను ఢీకొట్టి కారు ఆపకుండా వెళ్లిన న‌టుడు అరెస్ట్‌

రోడ్డు ప్రమాదం కేసులో నటుడు శ్రీనాథ్ భాసిని అరెస్టు చేసిన పోలీసులు.. స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. వివ‌రాళ్లోకెళితే.. శ్రీనాథ్ భాసి ప్రయాణిస్తున్న కారు బైక్‌ను ఢీకొట్టి.. ఆపకుండా వెళ్లిపోయింద‌ని ఎర్నాకులం సెంట్రల్ పోలీసులు మంగళవారం తెలిపారు. ఈ ఘటన గత నెల ఎనిమిదో తేదీన జరిగింది. శ్రీనాథ్ భాసీ ప్రయాణిస్తున్న కారు మట్టంచేరి నివాసి మహ్మద్ ఫహీమ్‌ను ఢీకొట్టింది. దీంతో బాధితుడి ఫిర్యాదు మేర‌కు కారులో ఉన్న వ్యక్తులపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆపై అరెస్ట్ చేయ‌గా.. ఆయ‌న స్టేషన్ బెయిల్‌పై విడుదల అయ్యారు.

ఇదిలావుంటే.. శ్రీనాథ్ భాసి కుందనూరులోని ఓ లగ్జరీ హోటల్‌లో జ‌రిగిన‌ పార్టీకి హాజరయ్యారనే అనుమానంతో పోలీసులు ఆయ‌న‌ను ప్రశ్నించారు. అంత‌కుముందు కుందనూరులోని ఓ హోటల్‌లో కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ ఓంప్రకాష్‌, అతడి సహచరుడు షిహాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విష‌య‌మై నటుడు శ్రీనాథ్ భాసితోపాటు నటి ప్రయాగ మార్టిన్‌లను పోలీసులు విచారించారు. అయితే అతడు పార్టీలో పాల్గొన్న‌ట్లు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని పోలీసులు ఆ తర్వాత చెప్పారు.

Next Story