ఉస్మానియా అనుబంధ ఆస్పత్రుల బలోపేతంపై ఉన్నత స్థాయి సమీక్ష
ఉస్మానియా మెడికల్ కాలేజీ అనుబంధ ఆసుపత్రులలలో వైద్య సేవల బలోపేతంపై మంత్రి దామోదర్ రాజనర్సింహా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
By - Knakam Karthik |
హైదరాబాద్: ఉస్మానియా మెడికల్ కాలేజీ అనుబంధ ఆసుపత్రులలలో వైద్య సేవల బలోపేతంపై రాష్ట్ర వైద్య , ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా SR నగర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ హెల్త్ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉస్మానియా మెడికల్ కాలేజీకి అనుబందంగా ఉస్మానియా హాస్పిటల్‌తో పాటు, నీలోఫర్ హాస్పిటల్, సరోజిని దేవి కంటి ఆస్పత్రి, ఎంఎన్‌జే కేన్సర్ హాస్పిటల్, టీబీ అండ్ చెస్ట్ హాస్పిటల్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, సుల్తాన్ బజార్ మెటర్నిటీ హాస్పిటల్, పెట్లబుర్జు మెటర్నిటీ హాస్పిటల్, ఈఎన్‌టీ హాస్పిటల్, ఫీవర్ హాస్పిటల్ లు అనుబంధంగా విశేష వైద్య సేవలను అందిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉస్మానియా హెల్త్ హబ్ గా , బ్రాండ్ గా ఉస్మానియా డాక్టర్లు గుర్తింపు తెచ్చారని..మంత్రి దామోదర్ రాజనర్సింహా అన్నారు.
ఉస్మానియా అనుబంధ ఆసుపత్రులలో వైద్య సేవల బలోపేతానికి చర్యలు చేపట్టాలని మంత్రి దామోదర్ రాజనర్సింహా అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఆసుపత్రి లో వైద్య సేవల బలోపేతం పై సుదీర్ఘంగా చర్చించారు . ఆసుపత్రిలోని పాత భవనాల పరిస్థితిపై క్షేత్ర స్థాయిలో తక్షణమే పర్యటించి వచ్చే రెండు, మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని TGMSIDC ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు . ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ కు పూర్వ వైభవాన్ని తెచ్చేందుకు ఆసుపత్రి లో మౌలిక సదుపాయాల కల్పన, HR, ఎక్విప్ మెంట్లు రిపేర్లు, RO వాటర్ ప్లాంట్, శానిటేషన్, డ్రైనేజీ సిస్టం, ఇన్ఫ్రా , అంతర్గత రోడ్లు , రోగులకు అవసరమైన సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహా అధికారులను ఆదేశించారు.