తెలంగాణ‌లో కోర్టులు తెరిచేందుకు హైకోర్టు అనుమ‌తి

High Court gives permission to open courts in Telangana. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కోర్టులు తెరిచేందుకు హైకోర్టు అనుమ‌

By Medi Samrat  Published on  9 Nov 2020 7:49 AM GMT
తెలంగాణ‌లో కోర్టులు తెరిచేందుకు హైకోర్టు అనుమ‌తి

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కోర్టులు తెరిచేందుకు హైకోర్టు అనుమ‌తి ఇచ్చింది. డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు కోర్టులు అనుస‌రించాల్సిన అన్‌లాక్ విధానాల‌ను ఉన్న‌త న్యాయ‌స్థానం వెల్ల‌డించింది. ఇప్పటికే హైదరాబాద్ మినహా మిగతా జిల్లాల్లో భౌతికంగా కేసుల విచారణ కొనసాగుతుంది. తాజాగా హైదరాబాద్ జిల్లాలోని సివిల్, క్రిమినల్ కోర్టులూ తెరవాలని హైకోర్టు ఆదేశించింది.

డిసెంబర్ 31వరకు హైకోర్టులో ప్రస్తుత ఆన్ లైన్, భౌతిక విచారణ విధానమే కొనసాగించాలని నిర్ణయించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు వీలైనంత వేగంగా విచారణ జరపాలని ప్రత్యేక కోర్టులకు హైకోర్టు సూచించింది. సీబీఐ, ఏసీబీ, ఎంపీలు, ఎమ్మెల్యేల కేసుల ప్రత్యేక కోర్టులు ఇప్పుడు అనుసరిస్తున్న విధానమే కొనసాగించాలని ఆదేశించింది. హైకోర్టు విధించిన గడువుకు కట్టుబడి విచారణ జరపాలని రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. Also Read:నిజామాబాద్‌: వీరుడా.. నువ్వు చేసిన త్యాగం మరువలేనిది


Next Story