Telangana Rising Global Summit-2025: గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు షెడ్యూల్‌, కార్యక్రమాలు ఇవిగో

తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ 2025 అట్టహాసంగా జరుగుతోంది. రెండవ రోజులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన...

By -  అంజి
Published on : 9 Dec 2025 8:16 AM IST

Telangana Rising Global Summit-2025, schedule , programs, Vision Document, Telangana

Telangana Rising Global Summit-2025: గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు షెడ్యూల్‌, కార్యక్రమాలు ఇవిగో

హైదరాబాద్‌: తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ 2025 అట్టహాసంగా జరుగుతోంది. రెండవ రోజులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన Telangana Rising 2047 Vision Documentను సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 6 గంటలకు ఆవిష్కరించనున్నారు.

రెండవ రోజు సమ్మిట్ లో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4:30 నిమిషాల వరకు ప్రత్యేక ప్యానెల్ చర్చలు నిర్వహించబడతాయి. ఎలక్ట్రానిక్స్,హెల్త్, ఐ.టి-సెమికండక్టర్‌, టూరిజం, విద్య, గ్రీన్‌ మొబిలిటీ, పరిశ్రమలు, మహిళా పారిశ్రామిక వేత్తలు, స్టార్టప్స్, సాంఘిక సంక్షేమం మొదలైన 15 అంశాలపై వచ్చిన దేశ విదేశీ అతిథులతో పాటు వివిధ రంగాలకు చెందిన నిపుణులు ప్యానల్ డిస్కషన్ చేస్తారు.

అంతర్జాతీయ, దేశీయ పెద్ద సంస్థలు, బ్యాంకులు, ఐ.టీ కంపెనీలు, ఆరోగ్య సంస్థలు, శాస్రీయ విద్యా సంస్థలు, పరిశ్రమలు, ప్రముఖ వ్యక్తులు పాల్గొంటారు. డబ్ల్యూహెచ్‌వో, వరల్డ్‌ బ్యాంక్‌, ఏడీబీ, ఐ.టి/పారిశ్రామిక కంపెనీల ప్రతినిధులు హాజరవుతారు

సాయంత్రం 7గంటలకు

3 వేల డ్రోన్లతో ఆకాశంలో తెలంగాణ ఈజ్ రైజింగ్.. కమ్.. జాయిన్ ద రైజ్ అనే అక్షరాల సమాహారం ఆవిష్కరించేలా డ్రోన్ షో నిర్వహిస్తారు. సాయంత్రం 7:30కు సమ్మె ముగింపు సందర్భంగా సాంస్కృత కార్యక్రమాలు ఉంటాయి. రాత్రి 8 గంటలకు గ్లోబల్ సమ్మెకు వచ్చిన దేశ విదేశీ అతిథులకు విందు ఉంటుంది.

సీఎం రేవంత్‌రెడ్డి షెడ్యూల్‌

రెండో రోజు తెలంగాణ రైజింగ్​ గ్లోబల్​ సమ్మిట్ లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్​ రెడ్డి దాదాపు 20 సమావేశాల్లో పాల్గొంటారు. ఎడ్యుకేషన్​, పవర్​, టూరిజం, లైఫ్ సైన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, AI తో పాటు వివిధ రంగాల పరిశ్రమల ప్రతినిధులతో చర్చలు జరుపుతారు. పలు సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉదయం 9.30కు ఎంసీహెచ్​ఆర్​డీ నుంచి హెలికాప్టర్​లో సీఎం ఫ్యూచర్ సిటీకి చేరుకుంటారు.

ఉదయం 10 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్లలో నెలకొల్పిన తెలంగాణ తల్లి విగ్రహాలను గ్లోబల్​ సమ్మిట్​ వేదిక నుంచి వర్చువల్​గా ఆవిష్కరిస్తారు. సాయంత్రం మహీంద్రా అండ్​ మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రాతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. గ్రీన్ వెహికిల్స్​, రూరల్ ఎంటర్‌ప్రైజ్ రంగాల్లో పెట్టుబడుల చర్చిస్తారు. సాయంత్రం 6 గంటలకు తెలంగాణ రైజింగ్​ విజన్​ డాక్యుమెంట్​ ను ఆవిష్కరిస్తారు. రాత్రి 7 గంటలకు డ్రోన్ షో.. ఫైర్ వర్క్స్​తో Telangana is Rising – Come, Join the Rise థీమ్‌ ప్రదర్శనతో ముగింపు వేడుక నిర్వహిస్తారు.

Next Story