తెలంగాణలో 2022లో సెలవులు ఇవే
Here is the list of holidays in Telangana for 2022.మరికొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది.
By తోట వంశీ కుమార్
మరికొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో 2022 సంవత్సరంలో సాధారణ సెలవులు, ఆప్షనల్ హాలీడేస్, పెయిడ్ హాలిడేస్ పై తెలంగాణ ప్రభుత్వం స్పష్టత నిచ్చింది. 2022లో ఆదివారాలు, రెండో శనివారాలు కలిపి ప్రభుత్వ కార్యాలయాలకు మొత్తం 28 రోజులపాటు సాధారణ సెలవులు, మరో 23 రోజులు ఆప్షనల్ హాలిడేస్ ను ప్రకటించింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
సాధారణ సెలవులు ఇవే..
జనవరి 1 - శనివారం - కొత్త సంవత్సరాది
జనవరి 14 -శుక్రవారం -భోగి
జనవరి 15 -శనివారం -సంక్రాంతి
జనవరి 26 -బుధవారం -రిపబ్లిక్ డే
మార్చి 1 - మంగళవారం -మహాశివరాత్రి
మార్చి 18 -శుక్రవారం -హోలీ
ఏప్రిల్ 2 -శనివారం -ఉగాది
ఏప్రిల్ 5 -మంగళవారం -జగ్జీవన్ రామ్ జయంతి
ఏప్రిల్ 10- ఆదివారం -శ్రీరామనవమి
ఏప్రిల్ 14 -గురువారం -అంబేద్కర్ జయంతి
ఏప్రిల్ 15 -శుక్రవారం -గుడ్ ఫ్రైడే
మే 3 -మంగళవారం -రంజాన్
మే 4 -బుధవారం -రంజాన్ తర్వాతి రోజు
జులై 10 - ఆదివారం - బక్రీద్
జులై 25 -సోమవారం -బోనాలు
ఆగస్టు 9 - మంగళవారం -మొహర్రం
ఆగస్టు 15 -సోమవారం -స్వాతంత్ర్య దినోత్సవం
ఆగస్టు 20 - శనివారం -శ్రీకృష్ణాష్టమి
ఆగస్టు 31 - బుధవారం - వినాయక చవితి
సెప్టెంబర్ 25 - ఆదివారం -బతుకమ్మ తొలిరోజు
అక్టోబర్ 2 -ఆదివారం -గాంధీ జయంతి
అక్టోబర్ 5 -బుధవారం విజయదశమి
అక్టోబర్ 6 -గురువారం -దసరా తర్వాతి రోజు
అక్టోబర్ 9 -ఆదివారం -ఈద్ మిలాదున్ నబీ
అక్టోబర్ 25 -మంగళవారం -దీపావళి
నవంబర్ 8 - మంగళవారం -కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి
డిసెంబర్ 25 - ఆదివారం - క్రిస్మస్
డిసెంబర్ 26 -సోమవారం -బాక్సింగ్ డే
జనవరి 1న సెలవు ఇవ్వడంతో ఫిబ్రవరి 12(రెండో శనివారం) పనిదినంగా పరిగణిస్తారు. ఇవి కాకుండా 23 ఐచ్ఛిక సెలవులు ఉంటాయి.