T-Ration App: 'T-రేషన్‌' యాప్‌.. ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే?

రేషన్‌ లబ్ధిదారుల కోసం ప్రభుత్వం 'T-రేషన్‌' యాప్‌ తీసుకొచ్చింది. కార్డు యాక్టీవ్‌లో ఉందా? ఆధార్‌తో లింక్‌ అయిందా? మీ రేషన్‌ డీలర్‌..

By -  అంజి
Published on : 21 Dec 2025 9:31 AM IST

Telangana, T Ration App, Electronic Public Distribution System

T-Ration App: 'T-రేషన్‌' యాప్‌.. ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే?

హైదరాబాద్‌: రేషన్‌ లబ్ధిదారుల కోసం ప్రభుత్వం 'T-రేషన్‌' యాప్‌ తీసుకొచ్చింది. కార్డు యాక్టీవ్‌లో ఉందా? ఆధార్‌తో లింక్‌ అయిందా? మీ రేషన్‌ డీలర్‌, షాప్‌ నంబర్‌, లోకేషన్‌, రేషన్‌ కోటా, ఇప్పటి వరకు ఎంత అందుకున్నారు వంటి వివరాలు ఈ యాప్‌లో చెక్‌ చేసుకోవచ్చు. వివరాలన్నీ తెలుగులో అందుబాటులో ఉంటాయి. ప్లేస్టోర్‌ నుంచి యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కాగా ప్రభుత్వం ఇటీవల మీసేవా వాట్సాప్‌, యూరియా యాప్‌నూ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

రేషన్ కార్డు సమాచారం సులభంగా అందించడం, రేషన్ పంపిణీలో పారదర్శకత పెంచడం, ప్రజలకు సమయం, శ్రమ ఆదా చేయడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ యాప్‌ను తీసుకొచ్చింది.

T-Ration App ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే?

మీ ఆండ్రాయిడ్‌ మొబైల్‌లో గూగుల్‌ ప్లే స్టోర్‌ని ఓపెన్ చేయండి. 'T-Ration Telangana' అని సెర్చ్ చేయండి. అధికారిక యాప్‌ను ఎంచుకోండి. ఇన్‌స్టాల్‌ బటన్‌పై క్లిక్ చేయండి. యాప్ ఓపెన్ చేసి ఉపయోగించడం ప్రారంభించండి.

T-Ration App ఓపెన్ చేయండి. భాషను ఎంచుకోండి (తెలుగు / English). ఆ తర్వాత మీ రేషన్ కార్డు నంబర్ లేదా ఆధార్ నంబర్ నమోదు చేయండి. అవసరమైతే OTP వెరిఫికేషన్ పూర్తి చేయండి. మీ రేషన్ వివరాలు, నెలవారీ సరుకులు, ట్రాన్సాక్షన్ హిస్టరీ చూడండి.

Next Story