తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అప్పపీడన ప్రభావంతో నేడు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
నేడు ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయంశకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాలలో రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే, నిర్మల్, నిజామాబాద్, కరీనగర్, ఉమ్మడి వరంగల్, జనగామ, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక హైదరాబాద్‌లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. లోతట్టు ప్రాంతాలు, వరద ప్రభావం చూపే ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదు అవ్వగా.. బుధవారం రాత్రి నుండి మరోసారి భారీ వర్షాలకు అవకాశం ఉందని వెల్లడించింది.