తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ దీపాంకరదత్త, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం కేసు విచారణ చేపట్టనున్నారు. ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ గురువారం తీర్పు ప్రకటించారు. ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పీకర్ స్పష్టం చేస్తూ..అనర్హత పిటిషన్‌లను కొట్టివేశారు.
ఇందులో భాగంగానే ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, ప్రకాశ్ గౌడ్‌లపై అనర్హత వేటు వేయడానికి నిరాకరించారు. బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని గత విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై డిసెంబర్ 18వ తేదీ లోపు నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీంకోర్టు సూచించింది.