విషాదం.. తుపాకీ మిస్‌ఫైర్‌.. హెడ్‌కానిస్టేబుల్‌ దుర్మరణం

Headconstable death due to gun misfire. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇల్లందు మండలం కొమరారం

By అంజి
Published on : 12 Feb 2022 10:08 AM IST

విషాదం.. తుపాకీ మిస్‌ఫైర్‌.. హెడ్‌కానిస్టేబుల్‌ దుర్మరణం

తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇల్లందు మండలం కొమరారం పరిధిలోని కాచనపల్లి పోలీస్‌స్టేషన్‌లో తుపాకీ మిస్‌ ఫైర్‌ కావడంతో హెడ్‌ కానిస్టేబుల్‌ సంతోష్ అక్కడికక్కడే మృతి చెందాడు. హెడ్‌కానిస్టేబుల్‌ సంతోష్‌ స్వస్థలం వరంగల్‌ జిల్లా గవిచర్ల. కాగా కాచనపల్లి పోలీస్‌స్టేషన్‌లో సంతోష్‌ విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి విధుల సమయంలో ఆయుధాలను పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తు ఓ తుపాకీ పేలిందని పోలీసు అధికారులు తెలిపారు.

ఈ విషాద ఘటనలో సంతోష్‌ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతదేహాన్ని ఇల్లంతు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తుపాకీ మిస్‌ ఫైర్‌ కావడానికి గల కారణాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇటీవలే హెడ్‌కానిస్టేబుల్‌ సంతోష్‌కు అతని తల్లిదండ్రులు వివాహ సంబంధం చూశారు. ఇంతలోనే కొడుకు తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story