Siddipet: విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

డ్యూటీలో ఉన్న ఓ హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందిన సంఘటన సిద్దిపేటలోని త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది.

By అంజి
Published on : 30 Jun 2024 9:00 PM IST

Head constable, heart attack, Siddipet

Siddipet: విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి 

సిద్దిపేట: డ్యూటీలో ఉన్న ఓ హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందిన సంఘటన సిద్దిపేటలోని త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. 1993 బ్యాచ్ కానిస్టేబుల్ కూచంపల్లి యాదగిరి (52) ఆదివారం స్టేషన్ ఆవరణలో కుప్పకూలిపోవడంతో త్రీటౌన్ ఇన్‌స్పెక్టర్ విద్యాసాగర్, ఎస్‌ఐ భాస్కర్, ఇతర సిబ్బంది అతన్ని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. యాదగిరికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ కుటుంబ సభ్యులతో మాట్లాడి కుటుంబాన్ని పోలీసు శాఖ తరఫున అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం పోలీసు లాంఛనాలతో యాదగిరి అంత్యక్రియలు నిర్వహించారు. స్థానిక శ్మశాన వాటికలో అంత్యక్రియలకు ముందు సాయుధ పోలీసు బలగాలు కానిస్టేబుళ్లు గాలిలోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఏడీసీపీ రామచంద్రరావు, ఏసీపీ సిద్దిపేట మధు, ఇతర అధికారులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆ కుటుంబానికి అధికారులు తక్షణ సాయంగా రూ.20వేలు అందజేశారు.

Next Story