రాహుల్‌ జీ.. 'శోక్‌'నగర్‌కు వెళ్లండి : హరీశ్‌రావు

రాహుల్ గాంధీ, తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర యువతను తప్పుదోవ పట్టించారని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎమ్మెల్యే టి హరీశ్ రావు మంగళవారం ఆరోపించారు.

By Kalasani Durgapraveen  Published on  5 Nov 2024 12:45 PM IST
రాహుల్‌ జీ.. శోక్‌నగర్‌కు వెళ్లండి : హరీశ్‌రావు

రాహుల్ గాంధీ, తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర యువతను తప్పుదోవ పట్టించారని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎమ్మెల్యే టి హరీశ్ రావు మంగళవారం ఆరోపించారు. ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిజిపిఎస్‌సి) పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేసినందుకు అభ్యర్థులను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదేనా కాంగ్రెస్ “ప్రజాపాలన”.. విద్యార్థులను నిర్బంధించడం కూడా ఇందులో ఉందా అని రాహుల్ గాంధీని అడిగారు. “రాహుల్ జీ.. మీరు సందర్శించిన ప్రదేశంలోనే విద్యార్థులను మీ ‘ప్రజా సర్కార్’ కొట్టిందని మీకు తెలుసా? అని అడిగారు.

రాష్ట్ర ప్రభుత్వం టీఎస్‌పీఎస్‌సీని.. టీజీసీఎస్‌సీగా మార్చిందని.. అయినా ఎలాంటి ప్రయోజనాలు జ‌ర‌గ‌లేద‌ని ఆయన అన్నారు. హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌ ప్రాంతాన్ని 'షోక్‌నగర్‌'గా మార్చారని.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మీరు ఆ ప్రాంతాన్ని సందర్శించాలని హరీశ్ రావు రాహుల్‌ గాంధీని కోరారు.

యువ వికాసం రూ.5 లక్షల హామీ ఖాళీ గ్యారెంటీగా మారిందని.. దీంతో తెలంగాణ యువతకు అభద్రతాభావం ఏర్పడిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల్లో కేవలం 10 శాతం మాత్రమే కల్పించిందని విమర్శించారు. జాబ్‌ క్యాలెండర్‌కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. దీనిని జాబ్ లెస్‌ క్యాలెండర్ అని పేర్కొన్నారు.


Next Story