Telangana: నేటి నుంచే ఒంటి పూట బడులు.. ఆ స్కూళ్లలో మాత్రం..

తెలంగాణలో నేటి నుంచి ఒంటి పూట బడులు షురూ కానున్నాయి. మార్చి 15 నుంచి ఏప్రిల్ 24 వరకు ఒంటి పూట

By అంజి  Published on  15 March 2023 7:42 AM IST
Half-day schools, Telangana

Telangana: నేటి నుంచే ఒంటి పూట బడులు

తెలంగాణలో నేటి నుంచి ఒంటి పూట బడులు షురూ కానున్నాయి. మార్చి 15 నుంచి ఏప్రిల్ 24 వరకు ఒంటి పూట బడులు పనిచేస్తాయని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి సంవత్సరం వేసవి వేడి కారణంగా రాష్ట్రం ఒంటి పూట బడులను నడుపుతుంది. రాష్ట్రంలోని ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లు, జిల్లా విద్యాశాఖాధికారులను ఉద్దేశించి ప్రభుత్వ ఉత్తర్వు జారీ చేసింది. ''ప్రభుత్వ, ప్రభుత్వ సహాయం పొందిన, ప్రైవేట్ మేనేజ్‌మెంట్ అన్ని మేనేజ్‌మెంట్‌ల క్రింద ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు పనిచేస్తాయి. మధ్యాహ్న భోజనాన్ని 12:30 గంటలకు అందిస్తారు'' అని ఉత్తర్వుల్లో పేర్కొంది.

అయితే ఎస్‌ఎస్‌సీ ప్రిపరేషన్ దృష్ట్యా పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయి. విద్యార్థులు ఏప్రిల్ నెలలో తమ పరీక్షలకు హాజరు కానున్నారు. ఎస్‌ఎస్‌సీ కేంద్రాలుగా పనిచేస్తున్న పాఠశాలలు మధ్యాహ్నం 1:00 నుండి సాయంత్రం 5:00 గంటల వరకు పని చేస్తాయి. "రాష్ట్రంలో లేదా సమీపంలోని పాఠశాల విద్య యొక్క అన్ని ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లు, జిల్లా విద్యాధికారులు పైన పేర్కొన్న ఆదేశాలను అన్ని మేనేజ్‌మెంట్‌ల క్రింద పనిచేస్తున్న పాఠశాలకు తెలియజేయాలని మరియు అమలును పర్యవేక్షించాలి'' అని ప్రభుత్వం ఆదేశించింది.

Next Story