సీఎం కేసీఆర్‌ మేనమామ కన్నుమూత

Guniganti Kamalakar Rao passed away.తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు మేన‌మామ అయ్యే గునిగంటి క‌మ‌లాక‌ర్‌రావు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Jan 2022 4:03 AM GMT
సీఎం కేసీఆర్‌ మేనమామ కన్నుమూత

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు మేన‌మామ అయ్యే గునిగంటి క‌మ‌లాక‌ర్‌రావు క‌న్నుమూశారు. రాజంపేట మండలం అర్గొండ గ్రామానికి చెందిన కమలాకర్‌రావు చాలా కాలంగా కామారెడ్డి పట్టణంలో నివసిస్తున్నారు. గ‌త కొంత‌ల‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న స్వ‌గృహంలో క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌స్సు 94 సంవ‌త్స‌రాలు. ఈయ‌న‌కు ముగ్గురు కుమారైలు, ఓ కుమారుడు ఉన్నారు. వీరంతా హైద‌రాబాద్‌లో ఉంటారు.

మరణవార్త తెలిసిన వెంటనే కుటుంబీకులంతా కామారెడ్డి చేరుకున్నారు. సందర్శకుల కోసం కామారెడ్డి దేవివిహార్ లో కమలాకర్ రావు పార్థివదేహాన్ని ఉంచారు. బంధువులతోపాటు పలువురు స్థానిక టీఆర్ఎస్ నేతలూ ఆయనకు నివాళుల‌ర్పించారు. అనంతరం దేవునిపల్లి స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. కమలాకర్‌రావు అంత్యక్రియలకు కేసీఆర్‌ కుటుంబ సభ్యులెవరూ హాజరుకాలేదు.

కాగా పదేళ్ల క్రితం కమలాకర్‌రావు భార్య చనిపోయినపుడు దశదిన కర్మకు ఉద్యమ నేతగా ఉన్న కేసీఆర్‌ హాజరయ్యారు. కామారెడ్డిలో పర్యటించిన ప్రతిసారి సీఎం కేసీఆర్‌ తన మేనమామ ఇంటికి బాల్యంలో అనేక సార్లు వచ్చేవాడినని, అప్పుడు కామారెడ్డి గంజ్‌లో బెల్లం వాసన గుప్పుమని వచ్చేదంటూ గుర్తు చేసుకునే వారు.

Next Story