తెలంగాణ ప్రజలకు శుభవార్త..గృహ విద్యుత్ ఛార్జీలు పెంపు లేదు

విద్యుత్ వినియోగదారులకు ఊరటనిస్తూ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (TSERC) 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కీలక నిర్ణయాలను వెలువరించింది

By -  Knakam Karthik
Published on : 2 April 2026 6:36 AM IST

Telangana, ElectricityCharges, TSERC, DomesticPower, PowerTariff

తెలంగాణ ప్రజలకు శుభవార్త..గృహ విద్యుత్ ఛార్జీలు పెంపు లేదు

తెలంగాణ రాష్ట్రంలోని కోటిన్నరకు పైగా ఉన్న విద్యుత్ వినియోగదారులకు ఊరటనిస్తూ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (TSERC) 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కీలక నిర్ణయాలను వెలువరించింది. ముఖ్యంగా సామాన్యులపై ఎలాంటి భారతం పడకుండా గృహ వినియోగదారులకు విద్యుత్ ఛార్జీలను యథాతథంగా కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. గత కొంతకాలంగా విద్యుత్ సంస్థలు నష్టాల్లో ఉన్నప్పటికీ, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కమర్షియల్, ఇండస్ట్రియల్ కేటగిరీలలో మినహా సామాన్య మధ్యతరగతి ప్రజలు వాడే గృహ విద్యుత్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.

అయితే, విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండే పీక్ అవర్స్ (ఉదయం 6 నుంచి 10 గంటలు, సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు) నిర్వహణను క్రమబద్ధీకరించేందుకు నాన్-డొమెస్టిక్ (వాణిజ్య) వినియోగదారులకు వర్తించే టైమ్ ఆఫ్ డే (ToD) ఛార్జీలను యూనిట్‌కు రూ.1 నుంచి రూ.1.50కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల వాణిజ్య సంస్థలు రద్దీ సమయాల్లో కాకుండా ఇతర సమయాల్లో విద్యుత్ వాడకాన్ని ప్రోత్సహించే అవకాశం ఉంటుంది.

Next Story