గత కొన్నాళ్లుగా గవర్నర్ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం అన్నట్లుగా ఉంది. అసెంబ్లీ ఆమోదించిన పది బిల్లులను పెండింగ్‌లో పెట్టడాన్ని సవాల్ చేస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ కంటే రాజ్‌భవన్ దగ్గర ఉందంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లడంపై పరోక్షంగా విమర్శలు చేశారు.
ఈ సందర్భంగా సీఎస్ శాంతికుమారిపై గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎస్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత రాజ్‌భవన్‌కు రాలేదని విమర్శలు చేశారు. ఢిల్లీ కంటే రాజ్‌భవన్ దగ్గర ఉందని గుర్తు చేశారు. "సీఎస్‌గా బాధ్యతలు తీసుకున్నాక రాజ్‌భవన్‌ను రావడానికి సమయం లేదా..? అధికారికంగా రాలేదు. ప్రోటోకాల్ లేదు. కనీసం మర్యాదపూర్వకంగా కూడా సీఎస్ కలవలేదు. స్నేహపూర్వక వాతావరణంలో అధికారిక పర్యటనలు ఉపయోగపడతాయి." అని గవర్నర్ ట్వీట్ చేశారు.