తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. కాళేశ్వరం కమిషన్ రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. ఎమ్మెల్యేలకు పెన్‌డ్రైవ్‌లో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఇచ్చారు. పురపాలక, పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లుతో పాటు అల్లోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ బిల్లును ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. అయితే ఫ్లోర్ లీడర్లకు మాత్రమే 650 పేజీల ఫిజికల్ రిపోర్టును అందజేస్తామని ప్రభుత్వం తెలిపింది. కేసీఆర్ ప్రధాన ప్రతిపక్షనేతగా సభకు రాలేదు కాబట్టి రిపోర్టు కాపీని ఇవ్వలేమని ప్రభుత్వం చెప్పినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.