తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో 20 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సిఆర్) అధికారులు బుధవారం తెలిపారు. మంగళవారం అర్థరాత్రి రాఘవాపురం-రామగుండం మధ్య కన్నాల రైల్వే గేట్‌కు సమీపంలో ఐరన్ ఓర్‌తో వెళ్తున్న గూడ్స్ రైలుకు చెందిన 11 వ్యాగన్లు పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు తెలిపారు. గూడ్స్ రైలు.. కర్ణాటకలోని బళ్లారి నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.ఇ
గూడ్స్ రైలు పట్టాలు తప్పిన కారణంగా, 20 ప్యాసింజర్ రైళ్లు రద్దు చేయబడ్డాయి, నాలుగు రైళ్లు పాక్షికంగా రద్దు చేయబడ్డాయి. 10 రైళ్లు దారి మళ్లించబడ్డాయి అని సౌత్ సెంట్రల్ రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. రెండు రైళ్లు కూడా రీషెడ్యూల్ చేయబడ్డాయి. మూడు రైళ్లు నియంత్రించబడ్డాయి అని ప్రకటన పేర్కొంది. ట్రాక్‌ను పునరుద్ధరించి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్న కేంద్రమంత్రి బండి సంజయ్.. రైల్వే జీఎంతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.