తెలంగాణ విద్యుత్ శాఖలో కొలువుల భర్తీకి ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే 3,260 పోస్టులు భర్తీ చేయాలని డిస్కమ్‌లు నిర్ణయించినట్లు సమాచారం. NPDCL వరంగల్‌లో 2,212 జేఎల్‌ఎం, 30 సబ్ ఇంజినీర్, 18 అసిస్టెంట్ ఇంజినీర్, NPDCLలో 600 జూనియర్ లైన్‌మన్ పోస్టులు, 300 సబ్ ఇంజినీర్, 100 AE పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ ఖాళీలను భర్తీ చేయనుందని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు.