నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో జాబ్ మేళా

నిరుద్యోగులకు శుభవార్త.. హైదరాబాద్ లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఆగస్టు 20న రెడ్‌రోజ్‌ ప్యాలెస్‌ ఫంక్షన్‌ హాల్‌ నాంపల్లిలో మెగా జాబ్‌ మేళా నిర్వహించనున్నారు.

By అంజి  Published on  18 Aug 2024 9:30 PM IST
unemployed, Job fair, Hyderabad

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో జాబ్ మేళా 

నిరుద్యోగులకు శుభవార్త.. హైదరాబాద్ లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఆగస్టు 20న రెడ్‌రోజ్‌ ప్యాలెస్‌ ఫంక్షన్‌ హాల్‌ నాంపల్లిలో మెగా జాబ్‌ మేళా నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళాలో అనేక కంపెనీలు పాల్గొంటున్నాయని.. ఫార్మా, హెల్త్, ఐటీ, ఐటీ సంస్థలు, బ్యాంకులు తదితర విభాగాల్లో ఉద్యోగాలు కల్పిస్తారని నిర్వాహకులు పత్రికా ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల అర్హత SSC దాటి ఉండాలి. ప్రాథమిక ఇంటర్వ్యూలు వేదిక వద్ద నిర్వహించనున్నారు. మరిన్ని వివరాల కోసం, ఆసక్తి ఉన్నవారు 8374315052 నంబర్‌లో సంప్రదించవచ్చు. పలు ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలకు అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా మినీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. పదవ తరగతి పూర్తయి ఉండాలని తెలిపారు నిర్వాహకులు. ఐ.టి.ఐ లో ఫిట్టరు, ప్లంబరు, వెల్డరు, డ్రాఫ్ట్ మెన్, సివిల్, లేదా ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఈనెల 20న మినీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. జిల్లా ఉపాధి కార్యాలయం, కర్నూలు ఆధ్వర్యంలో 20.08.2024న మంగళవారం ఉదయం 10.00 గంటలకు కర్నూలు పట్టణంలోని సి-క్యాంప్ లో ఉన్న జిల్లా ఉపాధికల్పనా కార్యాలయంలోఈ మినీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ప్రముఖ కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వనున్నాయి.

Next Story