తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. అందుబాటులోకి 'మీ సేవ' మొబైల్‌ యాప్‌

రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన 'మీ సేవ' మొబైల్‌ యాప్‌ను మంత్రి శ్రీధర్‌ బాబు లాంచ్‌ చేశారు. ఈ యాప్‌ ద్వారా ఇంటి నుంచే 150 రకాల సేవలు పొందవచ్చు.

By అంజి
Published on : 9 Dec 2024 7:26 AM IST

Telangana, Mee Seva, mobile app

తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. అందుబాటులోకి 'మీ సేవ' మొబైల్‌ యాప్‌

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన 'మీ సేవ' మొబైల్‌ యాప్‌ను మంత్రి శ్రీధర్‌ బాబు లాంచ్‌ చేశారు. ఈ యాప్‌ ద్వారా ఇంటి నుంచే 150 రకాల సేవలు పొందవచ్చు. కులం, ఆదాయం, జనన ధ్రువీకరణ పత్రాలు పొందవచ్చు. బిల్లుల చెల్లింపులు చేయవచ్చు. ఈ యాప్‌తో పాటు ఇంటింటికీ ఇంటర్నెట్‌ అందించే టీ ఫైబర్‌ నెట్‌ సేవలనూ ప్రభుత్వం ప్రారంభించింది. తొలుత పైలట్‌ ప్రాజెక్టుగా పెద్దపల్లి, నారాయణపేట, సంగారెడ్డి జిల్లాల్లో అమలు చేయనుంది.

అటు రాష్ట్రంలో రూ.1500 కోట్ల పెట్టుబడులకు లెన్స్‌కార్ట్‌తో ఎంవోయూ చేసుకున్నట్టు మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు. ఈ కంపెనీ కళ్లద్దాల పరికరాలకు సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్‌ ప్లాంట్‌ తెలంగాణలో ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. అక్కడ కళ్లద్దాలు, లెన్స్‌, సన్‌ గ్లాసెస్‌ తదితర వస్తువులు ఉత్పత్తి అవుతాయన్నారు. ఈ ప్లాంట్‌ ఏర్పాటు వల్ల దాదాపు 2100 మందికి ఉద్యోగాలు వస్తాయని ఎక్స్‌లో వెల్లడించారు.

Next Story