తెలంగాణలో బీర్ లవర్స్‌కు గుడ్ న్యూస్

తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్ లవర్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది యునైటెడ్ బ్రూబరీస్ సంస్థ. రాష్ట్రంలో కింగ్ ఫిషర్‌ బీర్లను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది.

By Knakam Karthik  Published on  20 Jan 2025 4:04 PM IST
Telangana, Good news for beer lovers

తెలంగాణలో బీర్ లవర్స్‌కు గుడ్ న్యూస్

తెలంగాణ కింగ్ ఫిషర్ బీర్లు తాగేవారికి గుడ్ న్యూస్ చెపింది బీర్ల తయారీ సంస్థ. తెలంగాణలో తగ్గిన బీర్ల నిల్వలపై యునైటెడ్ బ్రూబరీస్ సంస్థ స్పందించింది. రాష్ట్రంలో కింగ్ ఫిషర్ బీర్లను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటన చేసింది. బీర్ల ధర పెంపు, పాత బకాయిల విడుదలపై బేవరేజ్ కార్పొరేషన్ సానుకూలంగా స్పందించి.. త్వరలోనే వీటిపై నిర్ణయం్ తీసుకుంటామని హామీ ఇవ్వడంతో బీర్లను పునరుద్ధరిస్తున్నట్లు స్పష్టం చేసింది. వినియోగదారులు, కార్మికులు, వాటాదారుల ప్రయోజనాల దృష్ట్యా మధ్యంతర నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.

రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు రిలీజ్ చేయలేదనే కారణంతో కొద్ది రోజుల క్రితం తెలంగాణకు కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు యునైటెడ్ బ్రేవరిస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని కింగ్ ఫిషర్ బీర్ లవర్స్ డీలా పడిపోయారు. ఎందుకుంటే దానికి డిమాండ్ అలాంటిది. తమ ఫేవరెట్ బ్రాండ్ ఇక నుంచి లభించదనే సమాచారంతో అసంతృప్తికి గురయ్యారు కొందరు మందు బాబులు.

లేటెస్ట్‌గా ఈ అంశానికి సంబంధించి ఆ సంస్థ శుభవార్త చెప్పింది. తెలంగాణ బ్రేవరీస్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు (TGBCL) బీర్ సరఫరా పునఃప్రారంభించాలని నిర్ణయించింది యునైటెడ్ బ్రేవరీస్. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

Next Story