పిడుగుపాటుకు శరీరంపై కరిగిపోయిన బంగారం.. మహిళ పరిస్థితి విషమం

Gold chain melts after lightning strike on woman in Adilabad. సాధారణంగా వర్షాలు కురిసే సమయంలో పిడుగులు పడటం సహజం. అయితే తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లాలో అందరినీ

By అంజి  Published on  16 Oct 2022 10:54 AM GMT
పిడుగుపాటుకు శరీరంపై కరిగిపోయిన బంగారం.. మహిళ పరిస్థితి విషమం

సాధారణంగా వర్షాలు కురిసే సమయంలో పిడుగులు పడటం సహజం. అయితే తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లాలో అందరినీ షాకింగ్‌ గురి చేసే ఘటన జరిగింది. పిడుగుపాటుకు మహిళ శరీరంపై ఉన్న బంగారు ఆభరణాలు కరిగిపోయాయి. దీంతో ఆ మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. పిడుగుపాటుకు గురైన సమయంలో మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసు కరిగిపోయింది. ఈ ఘటన జిల్లాలోని పోచ్చర సమీపంలోని దిమ్మ గ్రామ శివారులో చోటు చేసుకుంది.

గ్రామ శివార్లలోని పొలంలో పనిచేస్తున్న శ్వేత పిడుగుపాటుకు తీవ్ర గాయాల పాలైంది. గ్రామస్థులు ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం. పిడుగుపాటుకు వచ్చిన వేడికి.. ఆమె మెడలోని బంగారు గొలుసు కరిగిపోయిందని చెబుతున్నారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా, ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రసుత్తం మహిళ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

Next Story
Share it