2027 గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు..రూ. 530 కోట్లతో మాస్టర్ ప్లాన్

తెలంగాణలో 2027 జూన్ 26 నుండి జూలై 7 వరకు జరగనున్న గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ సిద్ధమవుతోంది

By -  Knakam Karthik
Published on : 21 Feb 2026 2:22 PM IST

Godavari Pushkaralu 2027, Telangana, Pushkaralu, Spiritual Telangana,  Godavari Ghats, TelanganaGovernment

2027 గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు..రూ. 530 కోట్లతో మాస్టర్ ప్లాన్

తెలంగాణలో 2027 జూన్ 26 నుండి జూలై 7 వరకు జరగనున్న గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ సిద్ధమవుతోంది. ఇందుకోసం రూ. 530 కోట్ల కేటాయింపులు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

ఈ నిధులతో బాసర, ధర్మపురి, కాళేశ్వరం, భద్రాచలం వంటి ప్రధాన క్షేత్రాలతో పాటు గోదావరి తీరాన ఉన్న చిన్న ఆలయాల వద్ద కూడా స్నానఘట్టాల నిర్మాణం, మరమ్మతులు చేపట్టనున్నారు. ఇప్పటికే గత బడ్జెట్‌లో కేటాయించిన రూ. 175 కోట్లలో రూ. 50 కోట్లు విడుదలయ్యాయి. ప్రధానంగా భక్తుల సౌకర్యాలు, పార్కింగ్ స్థలాలు, ఘాట్ల అభివృద్ధిపై అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

Next Story