మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేయనున్న గద్దర్

Gaddar to contest Munugodu by-election. మునుగోడు ఉప ఎన్నికలో ప్రజాశాంతి పార్టీ టిక్కెట్‌పై విప్లవ యోధుడు గద్దర్‌ (గుమ్మడి విట్టల్‌రావు) పోటీ చేయనున్నారు.

By అంజి  Published on  6 Oct 2022 5:40 AM GMT
మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేయనున్న గద్దర్

మునుగోడు ఉప ఎన్నికలో ప్రజాశాంతి పార్టీ టిక్కెట్‌పై విప్లవ యోధుడు గద్దర్‌ (గుమ్మడి విట్టల్‌రావు) పోటీ చేయనున్నారు. కొన్నేళ్ల క్రితం నక్సలైట్లతో తెగతెంపులు చేసుకున్న తర్వాత గద్దర్ పోటీ చేస్తున్న తొలి ఎన్నిక ఇదే. గద్దర్‌ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌.. నేటి నుంచి మునుగోడులో ప్రచారం చేయనున్నారు. గద్దర్‌కు బీజేపీ, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మద్దతు ఇస్తే ప్రజా శాంతి పార్టీ రంగంలోకి దిగి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుందన్నారు. ఎన్నికలు ముగిసే వరకు మునుగోడులో గద్దర్ వెంటే ఉంటానని పాల్ చెప్పారు.

నిరాహార దీక్ష విరమించాలని కేఏ పాల్‌కు గద్దర్ నిమ్మరసం అందించారు. శాంతి సమావేశానికి పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని నిరసిస్తూ పాల్ అక్టోబర్ 2న నిరాహార దీక్ష ప్రారంభించారు. తెలంగాణలోని అనేక పార్టీలు తమతో చేతులు కలపాలని కేఏ పాల్ ఆహ్వానించారు. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ప్రజా శాంతి పార్టీలో చేరానని గద్దర్ అన్నారు. ఇంటింటి ప్రచారం చేస్తానని చెప్పిన ఆయన తన వద్ద డబ్బులు లేవని, ఓటుకు డబ్బులు కూడా ఇవ్వనని అన్నారు. 'రాజ్యాంగాన్ని కాపాడేందుకే నేను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను' అని గద్దర్ అన్నారు.

Next Story