రేపు మధ్యాహ్నం వరకు పూర్తి పోలింగ్‌ శాతం: తెలంగాణ సీఈవో

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణలో భాగంగా శాంతి భద్రతల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలేత్తలేదని సీఈవో వికాస్‌ రాజ్‌ తెలిపారు.

By అంజి  Published on  13 May 2024 8:33 PM IST
polling, Telangana, CEO Vikas Raj

రేపు మధ్యాహ్నం వరకు పూర్తి పోలింగ్‌ శాతం: సీఈవో

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణలో భాగంగా శాంతి భద్రతల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలేత్తలేదని సీఈవో వికాస్‌ రాజ్‌ తెలిపారు. రేపు మధ్యాహ్నం వరకూ పూర్తి పోలింగ్‌ శాతం తెలిసే అవకాశం ఉంటుందని వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 44 స్ట్రాంగ్‌ రూమ్స్‌ ఉన్నాయన్నారు. ఈ రోజు మొత్తం 400 ఫిర్యాదులు రాగా.. 38 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయని వివరించారు. 1400 పోలింగ్‌ కేంద్రాల వద్ద ఇంకా ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఓటింగ్‌ శాతం ఎక్కువగా నమోదు అయ్యిందని తెలిపారు. 200కు పైగా సీ విజిల్ ద్వారా ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ ఎన్నికల్లో రూ.330 కోట్లు సీజ్ చేశామన్నారు. ఇవాళ అర్థరాత్రి వరకు పోలింగ్ శాతం గంట గంటకు మారుతుందని చెప్పారు. స్ట్రాంగ్ రూమ్ లకు ఈవీఎంల తరలింపులో వాహనాలకు జీపీఎస్‌ ఉంటుందన్నారు. పోలింగ్ పై రేపు స్క్రూటినీ ఉంటుందని, రీ పోల్ పై రేపు తెలుస్తుందన్నారు. ఇప్పటికైతే ఎలాంటి సమస్యలు లేవని వికాస్ రాజ్ తెలిపారు. అందరి నుంచి మాకు మంచి సహకారం అందిందన్నారు.

Next Story