తెలంగాణ నూతన సచివాలయం ప్రత్యేకతలివే
హైదరాబాద్ నడిబొడ్డున మరో అద్భుత కట్టడం ఆవిష్కృతమైంది. తెలంగాణ చరిత్రపుటలో మరో మకుటం కొలువుదీరింది.
By అంజి Published on 30 April 2023 12:00 PM ISTతెలంగాణ నూతన సచివాలయం ప్రత్యేకతలివే
హైదరాబాద్ నడిబొడ్డున మరో అద్భుత కట్టడం ఆవిష్కృతమైంది. తెలంగాణ చరిత్రపుటలో మరో మకుటం కొలువుదీరింది. తెలంగాణ నూతన పాలన సౌధం… భాగ్యనగరం నడిబొడ్డున నిర్మించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ కొత్త సచివాలయం అత్యంత సువిశాలమైన ప్రత్యేకతలు కలిగిన భవనం. ఈ భవనం యొక్క ప్రత్యేకతలు ఇప్పుడు తెలుసుకుందాం..
- దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ కొత్త సచివాలయం అత్యంత సువిశాలమైన, ప్రత్యేకతలు కలిగిన భవనం
- మొత్తం 28 ఎకరాల సచివాలయ స్థలంలో రెండున్నర ఎకరాల్లో మాత్రమే సచివాలయ భవనాన్ని నిర్మించారు.
- నూతన సచివాలయానికి రాష్ట్ర ప్రభుత్వం.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంగా నామకరణం చేసింది.
- సచివాలయంలో మొత్తం 635 గదులు, 30 కాన్ఫరెన్స్ హాళ్లు ఏర్పాటు చేశారు.
- మొత్తం 10 లక్షల చదరపు అడుగుల భవన నిర్మాణాన్ని 20 నెలల్లో పూర్తి చేశారు.
- సచివాలయ నిర్మాణానికి రూ.617 కోట్లకు పైగా వ్యయమైంది.
- మంత్రులందరికీ ప్రత్యేక ఛాంబర్లతో పాటు కాన్ఫరెన్స్ హాళ్లు ఏర్పాటు చేశారు.
- సచివాలయ నిర్మాణంలో రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ మైన్ నుంచి తెప్పించిన రెడ్ శాండ్ స్టోన్‌ను వాడారు.
- కొత్త సచివాలయంలో 24 లిఫ్టులతో పాటు 300 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
- సచివాలయానికి నాలుగు వైపులా నాలుగు ద్వారాలు, తూర్పు వైపు నుంచి సీఎం, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎస్, డీజీపీలకు ప్రవేశం
- తెలంగాణ కొత్త సచివాలయంలో 2 వేల మంది పని చేయనున్నారు.
- సచివాలయంలో రిసెప్షన్ హాలు, మీడియా హాలు, రెండు బ్యాంకులు, బస్ కౌంటర్, రైల్వే కౌంటర్, క్యాంటీన్, డిస్పెన్సరీ, మసీదు, దేవాలయం, చర్చి ఉన్నాయి.