పీఎం కిసాన్, ఆవాస్ పేరుతో మోసాలు.. ప్రజలకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ అలర్ట్
పీఎం కిసాన్, పీఎం ఆవాస్ యోజన పేరుతో వచ్చే ఎస్‌ఎంఎస్‌లను నమ్మవద్దని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కోరింది.
By అంజి Published on 21 Nov 2024 11:40 AM ISTపీఎం కిసాన్, పీఎం ఆవాస్ పేరుతో మోసాలు
పీఎం కిసాన్, పీఎం ఆవాస్ యోజన పేరుతో వచ్చే ఎస్‌ఎంఎస్‌లను నమ్మవద్దని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కోరింది. సైబర్ నేరగాళ్లు ఈ పథకాల పేర్లతో నకిలీ ఎస్‌ఎంఎస్‌లు పంపి మోసాలకు పాల్పడుతున్నట్టు గుర్తించింది. ఏపీకే ఫైల్స్ పంపి, వాటి ద్వారా పథకంలో చేరాలని చెబితే ఆ లింక్స్ క్లిక్ చేయవద్దని సూచించింది. తెలియని వ్యక్తుల నుంచి ఏపీకే ఫైల్స్ వస్తే ఓపెన్ చేయవద్దని హెచ్చరించింది. అనుమానం వస్తే 1930కి కాల్ చేయాలని చెప్పింది.
మోసాన్ని గుర్తించిన వెంటనే ఇవి చేయండి.
- అనుమానాస్పద యాప్‌ను వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయండి.
- హ్యాక్ అయ్యే అవకాశం ఉన్న ఖాతాల పాస్‌వర్డ్లను మార్చండి.
గోల్డెన్ అవర్ రిపోర్టింగ్:
మోసం జరిగిన కొన్ని గంటల్లో ఫిర్యాదు చేయడం ద్వారా నష్టాన్ని తగ్గించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోలుకునే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. మోసం జరిగిందని తెలిస్తే వెంటనే 1930 ద్వారా హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయండి. లేదా cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయండి.
జాగ్రత్త చర్యలు:
- తెలియని వ్యక్తుల నుండి ఏపీకేలను డౌన్‌లోడ్ చేయొద్దు. గూగుల్ ప్లే లేదా నమ్మదగిన వెబ్‌సైబ్‌లను మాత్రమే ఉపయోగించండి.
- యాప్ యొక్క సమీక్షలు, అనుమతులు, ప్రచురణకర్త వివరాలను తనిఖీ చేయడం ద్వారా యాప్ నకిలీదో కాదో ధృవీకరించుకోవాలి.
- ఎస్‌ఎంఎస్, ఈ మెయిల్ లేదా మెసేజింగ్ యాప్స్ ద్వారా పంపి అనుమానాస్పద లింక్‌లు క్లిక్ చేయవద్దు.
- మీ డివైస్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్, ఆపరేటింగ్ సిస్టమ్‌ను క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయండి.