రైస్ పుల్లింగ్ పాత్రతో.. వ్యాపారికి రూ.3 కోట్ల కుచ్చు టోపీ పెట్టిన నలుగురు అరెస్ట్
అంతరిక్ష పరిశోధనలకు ఉపయోగించే అయస్కాంత రాగి పాత్రను విక్రయిస్తామంటూ ఓ వ్యక్తిని రూ.3 కోట్ల మేర మోసం చేసిన నలుగురిని పోలీసులు పట్టుకున్నారు.
By అంజి Published on 28 Sept 2023 8:47 AM ISTరైస్ పుల్లింగ్ పాత్రతో.. వ్యాపారికి రూ.3 కోట్ల కుచ్చు టోపీ పెట్టిన నలుగురు వ్యక్తులు
మంత్రాలు తంత్రాలు లేవు. టేబుల్ మీద పెట్టామంటే చాలు తనవైపు ప్రతి వస్తువును ఆకర్షిస్తుంది.. దానికి ధర ఎక్కువే.. ఇస్రో, నాసా ఈ పాత్రను కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిందని అంటూ అమాయకమైన జనాలను మోసం చేస్తూ ఉన్నా ముఠాను వెస్ట్ జోన్ స్పెషల్ జోనల్ క్రైమ్ టీం పట్టుకున్నారు. హైదరాబాద్ నగరంలో కొందరు జనాలు.. నిందితులు చెప్పే హాస్యాస్పదమైన వాటిని కూడా నమ్మి గుడ్డిగా వారి చేతిలో కోట్ల రూపాయలను పెట్టేస్తున్నారు. ఓ నలుగురు నిందితులు రైస్ పుల్లింగ్ పాత్రను చూపించి ఎలాంటి మంత్రాలు తంత్రాలు లేకుండా ఈ పాత్ర వస్తువులను తన వైపు లాగ గల శక్తి కలిగి ఉందని దీనిని పొందడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారని కోట్ల రూపాయల విలువ గల ఈ పాత్రను మీ సొంతం చేసుకుంటే మీకు అన్ని శుభలు కలుగుతాయని మాయమాటలు చెప్పి బాధితుల వద్ద నుండి కోట్లలో డబ్బులు వసూలు చేశారు.
నల్ల బోలు విజయ్ కుమార్ (31), రాయుడు సాయి భరద్వాజ్ (32), ముస్కాపురం సంతోష్ (38), ఉప్పుటూరి సురేందర్ (31) వీరందరూ హైదరాబాదు నగరంలోని మౌలాలి, మేడిపల్లి కి చెందినవారు. ఈ నలుగురు సులభ పద్ధతిలో డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే బాధితులతో మంచి పరిచయం ఏర్పరచుకున్నారు. వారి వద్ద రైస్ పుల్లింగ్ పాత్ర ఉందని దానిని చూపించి బాధితులను ఆకర్షించారు. ఈ పాత్ర ఆకాశంలో మెరుపులు వచ్చిన సమయంలో భూమిపై వచ్చి పడిందని.... ఈ పాత్ర వస్తువులను తన వైపు లాగ గల శక్తి కలిగి ఉందని, ఐసోటోప్ రేడియేషన్ కలిగి ఉందని బాధితులకు మాయ మాటలు చెప్పిన నమ్మించారు. ఈ రైస్ పుల్లింగ్ ఉపగ్రహాలు, అణ్యాయుధాల కొరకు ఉద్దేశించబడిందని.. ఈ పాత్ర కొరకు నాసా, ఇస్రో కోట్ల రూపాయలకు కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యాయని కల్లబొల్లి కబుర్లు చెప్పి అమాయక జనాలను నమ్మించారు.
ఈ హాస్యాస్పదమైన ఘటనను నమ్మి బాధితులు కోట్ల రూపాయలను వారికి చెల్లించారు.. ఈ విధంగా తేటి కిరణ్ అనే వ్యక్తి మూడు కోట్ల వారికి ఇచ్చాడు. వారి నుండి తీసుకున్న రైస్ పుల్లింగ్ పాత్ర లో ఎటువంటి ఆకర్షించే శక్తి లేదని తెలుసుకొని తాను మోసపోయానని గ్రహించిన కిరణ్ పోలీసులను ఆశ్రయించాడు.. పోలీసులు 420, 506 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేసుకొని రంగంలోకి దిగి నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి రైస్ పుల్లింగ్ అని నిందితులు చెబుతున్న పాత్రను స్వాధీనం చేసుకున్నారు.