హైదరాబాద్: మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ మరియు కాల్పుల కేసులో సంచలన పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు పంజుగుల రితేష్ రెడ్డితో పాటు మరో నిందితుడు నమిత్ శర్మకు కోర్టు మూడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు చంచల్‌గూడ జైలులో ఉన్న నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. మార్చి 26 వరకు వీరిని క్షుణ్ణంగా విచారించనున్నారు.
ఈ విచారణలో ప్రధానంగా డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్ ఎక్కడి నుండి సాగుతోంది? అసలు ఆ ఫామ్‌హౌస్‌లో కాల్పులు ఎందుకు జరిగాయి? ఆ రోజు జరిగిన డ్రగ్ పార్టీలో ఇంకా ఎవరెవరు పాల్గొన్నారు? అనే కోణంలో పోలీసులు కూపీ లాగనున్నారు. ఈ కేసులో మరిన్ని సంచలన నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.