రిపబ్లిక్‌ డే వేడుకల్లో మాజీ హోంమంత్రికి అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు

తెలంగాణ భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు.

By Srikanth Gundamalla  Published on  26 Jan 2024 6:53 AM GMT
former Home Minister, ill,  Republic Day, celebrations , brs,

రిపబ్లిక్‌ డే వేడుకల్లో మాజీ హోంమంత్రికి అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు

తెలంగాణ భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో బీఆర్ఎస్‌ ముఖ్యనేతలంతా పాల్గొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అయితే.. ఆ సమయంలోనే వేడుకల్లో పాల్గొన్న మాజీ హోంమంత్రి మహమూద్‌అలీ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఆయన అక్కడే కుప్పకూలిపోయారు.

ఇక వెంటనే స్పందించిన బీఆర్ఎస్ నాయకులు ఆయన్ని పైకి లేపే ప్రయత్నం చేశారు. మేల్కొల్పాలని చూశారు. కానీ.. ఆయన ఏమాత్రం స్పందించలేదు. దాంతో.. మాజీ హోంమంత్రి మహమూద్‌ అలీని భుజాలపై మోస్తూ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమ చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత కోలుకోవడంతో ఆయన్ని ఇంటికి తీసుకెళ్లారు. అయితే.. మాజీ హోంమంత్రి ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఆయన చికిత్స తర్వాత కోలుకుని ఇంటికి చేరుకున్నారనే విషయం తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తెలంగాణ భవన్‌లో గణతంత్ర వేడుకల్లో భాగంగా తర్వాతి కార్యక్రమాలను యథావిధిగా నిర్వహించారు. కాగా.. మాజీ హోంమంత్రి మహమూద్‌అలీ అస్వస్థతకు గురి అయ్యిన విషయంలో మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.


Next Story