మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి కన్నుమూత

చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే, న్యూస్ & సర్వీసెస్ సిండికేట్ (NSS) మేనేజింగ్ డైరెక్టర్ కొండా లక్ష్మారెడ్డి కన్నుమూశారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు.

By -  అంజి
Published on : 13 Oct 2025 11:37 AM IST

Former Chevella MLA, Konda Lakshma Reddy, Telangana,

మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి కన్నుమూత

చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే, న్యూస్ & సర్వీసెస్ సిండికేట్ (NSS) మేనేజింగ్ డైరెక్టర్ కొండా లక్ష్మారెడ్డి కన్నుమూశారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు. వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధతపడుతున్న ఆయన ఇవాళ ఉదయం 5.30 గంటల సమయంలో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీసీసీ ప్రతినిధి, గ్రీవెన్స్‌ సెల్‌ ఛైర్మన్‌తో పాటు పలు పదవుల్లో పని చేశారు. 1999, 2014లో హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

జర్నలిజం పట్ల మక్కువతో ఆయన 1980లో స్థానిక వార్తా సంస్థ NSSను ప్రారంభించారు. జూబ్లీ హిల్స్ జర్నలిస్ట్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. ఆయన రాజకీయ జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీతో ముడిపడి ఉంది. ఆయన అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డి మనవడు. ఆయన తన రాజకీయ జీవితంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) ప్రతినిధి, గ్రీవెన్స్ సెల్ చైర్మన్‌తో సహా వివిధ పదవులను నిర్వహించారు.

Next Story